నిర్మాతలను భయపెడుతున్న ఓటీటీ బ్యాడ్ సెంటిమెంట్
మహమ్మారి వైరస్ ప్రభావం సినిమా పరిశ్రమపై తీవ్రంగా పడినది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు నెలలు షూటింగ్స్ బంద్ అవ్వడంతో పాటు మూడు నెలలకు పైగా థియేటర్లు బంద్ ఉన్నాయి. ఇంకా ఎంత కాలం థియేటర్లు బంద్ ఉంటాయో తెలియని పరిస్థితి. తిరిగి థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయి అనే విషయంలో స్పష్టత లేని కారణంగా నిర్మాతలు చాలా మంది తమ సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీపై విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమయంలో నిర్మాతలకు ఓటీటీ అనేది చాలా గొప్ప అవకాశంగా మారింది. కాని ఇప్పటికే విడుదలైన కొన్ని సినిమాల ఫలితంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.
సౌత్ నుండి ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి ఆశించిన రేంజ్ లో స్పందన దక్కలేదు. ఆ కారణంగానే ఓటీటీలో సినిమాలు విడుదల చేయాలంటే వెనుక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడినది అంటూ నిర్మాతలు అంటున్నారు.
మలయాళం నుండి ఇప్పటి వరకు డైరెక్ట్ ఓటీటీ మూవీ ఏదీ రాలేదు. జులై 3వ తారీకున సుఫియుమ్ సుజాతయుమ్ అనే చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ద్వారానే ఇది కూడా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటి వరకు నేరుగా ఓటీటీలో విడుదల అయిన సినిమాలు ఏవీ కూడా హిట్ అవ్వలేదు. మరి ఈ చిత్రం అయినా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సక్సెస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి.
‘సుఫియుమ్ సుజాతయుమ్’ చిత్రంలో హీరోగా జయసూర్య నటించగా హీరోయిన్ గా అధితి రావు హైదరీ నటించింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రంను విజయ్ బాబు తెరకెక్కించాడు. తెలుగులో కూడా అధితి రావుకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రంను తెలుగులో కూడా డబ్ చేసే అవకాశం ఉందంటున్నారు.