• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్‌ టాక్ : పోలీసు...

ట్రైలర్‌ టాక్ : పోలీసు బావ తప్పుడు బామ్మర్థి

By - Tupaki Desk
Update: 2021-08-05 05:16 GMT
సిద్దార్థ తెలుగు లో ఒకప్పుడు మంచి ఫేమ్‌ ఉన్న హీరో. బొమ్మరిల్లు తో పాటు పలు సినిమాలతో తెలుగు లో స్టార్‌ హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత వరుస ప్లాప్‌ ల వల్ల తెలుగు లో ఈయన సినిమాలు తగ్గాయి. మెల్ల మెల్లగా సినిమాలు తగ్గుతున్నా కూడా ఈయన హీరోగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. తమిళంలో బిజీ అయిన సిద్దార్థ్‌ తెలుగు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. తెలుగు లో అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. డబ్బింగ్‌ సినిమాలతో సందడి చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. త్వరలో ఈయన 'ఒరేయ్‌ బామ్మర్థి' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో సిద్దార్థ హీరోగా నటించగా కీలక పాత్రలో యువ సంగీత దర్శకుడు కమ్‌ యంగ్‌ హీరో జీవీ ప్రకాష్‌ నటించాడు. సిద్దార్థ్‌ పోలీస్ గా కనిపించబోతుండగా జీవీ ప్రకాష్ తప్పుడు దారిలో నడిచే ఒక సామాన్య కుటుంబంకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. సిద్దార్థ్‌ ప్రేమించిన అమ్మాయి సోదరుడు జీవీ ప్రకాష్‌. అతడు బైక్‌ రేసింగ్ లతో పాటు తప్పుడు దారిలో నడుస్తుండటంతో అతడికి ఎలా బుద్ది చెప్తాడు.. తన ప్రేయసి కోసం అతడిని ఎలా తన దారిలోకి తెచ్చుకుంటాడు హీరో అనే కథతో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.

సిద్దార్థ్‌ చాలా కాలం తర్వాత ఈ సినిమా తో కనిపించబోతున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 13 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు ఏవీ కూడా విడుదల కావడం లేదు. ఈ సమయంలో ఈ సినిమా ను తీసుకు రానుండటం వల్ల ఫలితం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించగా రమేష్‌ పి పిల్లై నిర్మించారు. సంగీతాన్ని సిద్దు కుమార్‌ అందించారు.


Full View





Tags:    
  • Orey Baammardhi Trailer 
  • Orey Baammardhi Trailer talk 
  • Siddarth Orey Baammardhi Trailer 
  • gv prakash 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS