బిగ్ బాస్ 2: ఫైనల్ కు స్టార్ గెస్ట్ రెడీ!

Update: 2018-09-19 13:40 GMT
స్టార్ మాలో బిగ్ బాస్ -2 సీజన్ ప్రస్తుతం విపరీతంగా వార్తల్లో నానుతున్న విషయం తెలిసిందే.   న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకు  ఒకవైపు పాపులారిటీ పెరుగుతూ ఉంటే మరోవైపు వివాదాలు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇక మరో రెండు వారాల్లో సెకండ్ సీజన్ ముగుస్తోంది.

దాంతో ఫైనల్ ఎపిసోడ్ పై అంతటా ఆసక్తి నెలకొంది.  ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారు అనే క్యూరియాసిటీతో పాటు ఫైనల్ ఎపిసోడ్ కు ఏ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నాడు అనే విషయం లో కూడా చర్చలు సాగుతున్నాయి.  మొదటి సీజన్ బిగ్ బాస్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్-2 గ్రాండ్ ఫినాలే కి ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు తన అంగీకారం తెలిపాడట.

నిజానికి ఎన్టీఆర్ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించాల్సింది కానీ తన సినిమా కమిట్మెంట్స్ వల్ల తప్పుకున్నాడు. దీంతో నాని బిగ్ బాస్ హోస్ట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.  మరి ఫైనల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ను గెస్ట్ గా చూడడం బిగ్ బాస్ అభిమానులను థ్రిల్ చేస్తుందనడం లో సందేహం లేదు.  ఇక ఎన్టీఆర్ - నాని ఇద్దరూ ఎనర్జీ కి మారు పేరు కాబట్టి వారిద్దరి కాంబినేషన్ ఫైనల్ అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చెయ్యడం ఖాయం.


Tags:    

Similar News