తంబీల వద్దకు వెళ్తానంటున్న టైగర్

Update: 2015-08-20 11:52 GMT
తమిళ కథా నాయకులు, దర్శకులు తెలుగు వారికి ధీటుగా ఇక్కడ ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోలలో రజనీకాంత్ మొదలుకొని కమల్ - సూర్య - విక్రం - కార్తీ తాజాగా విజయ్ వంటి వారుంటే దర్శకులలో మణిరత్నం, శంకర్, గౌతమ్ మీనన్ లాంటివారున్నారు. గౌతమ్ మీనన్ తన ప్రతి సినిమాని రెండు భాషల్లోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటానని మొన్న ఒక ఇంటర్వ్యూ లోనూ స్పష్టం చేశారు. అన్న సూర్య చేయలేకపోయినా తమ్ముడు కార్తి ద్వి భాషా చిత్రం చేస్తున్నాడు. అంటే తెలుగు సినిమా చేస్తునట్టే.

ఇలాంటి వాటిని దృష్టి పెట్టుకునే మనవాళ్ళూ అక్కడా జెండా ఎగరెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన పప్పులు అక్కడ ఉడకడం లేదు. దానికి తాజా ఉదాహరణ శ్రీమంతుడు సినిమానే. తమిళ హీరోల్లానే మహేష్ కూడా సెల్వందన్ పేరుతో రెండు చోట్లా ఒకే రోజున విడుదల చేశారు. ఇక్కడ సూపర్ హిట్ అయింది
కానీ అక్కడ బోల్తా పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సుకుమార్ తో చేస్తున్న 25వ సినిమాని తంబీలకు చూపిస్తా అంటున్నాడు. సుకుమార్ సినిమాలకి మన ప్రేక్షకులే ఇప్పుడిప్పుడు అలవాటు పడుతున్నారు. ఇక అందులో 'మాసు' వాసన తగల్లేదో ఇక అంతే. ఈ సినిమాలో ఒక్కటి మాత్రం రెండు చోట్లా నచ్చుతుంది. అది దేవి శ్రీ సంగీతం మరియు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఐటెం సాంగ్. ఆశ్చర్యంగా వున్నా ఇదే నిజం.
Tags:    

Similar News