3 రోజుల్లోనే 35 కోట్లు.. వరుణ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్

థియేటర్ల దగ్గర ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వరుణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.

Update: 2026-08-10 05:44 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కలెక్షన్ల పరంగా కూడా చాలా వేగంగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. థియేటర్ల దగ్గర ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వరుణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయాల్లో మెయిన్ హైలెట్ ఏంటంటే, మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం. అసలైతే ఈ రోజుల్లో ఒక సినిమా సేఫ్ జోన్ లోకి రావడానికి చాలా టైమ్ పడుతుంది. అలాంటిది కొరియన్ కనకరాజు చాలా వేగంగా డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను లాభాల బాట పట్టించింది. చాలా కాలంగా ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ కి ఈ సినిమాతో పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ దక్కింది.

సరైన కంటెంట్ పడితే వరుణ్ తేజ్ బాక్సాఫీస్ స్టామినా ఏ స్థాయిలో ఉంటుందో ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ సినిమాలో చూపించిన కొత్త రకం మేకోవర్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. తన ఇమేజ్ కి తగ్గట్టుగా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చి థియేటర్లకు జనాలను రప్పించడంలో వరుణ్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఈ విజయం అతని కేరియర్ లో ఒక మంచి సక్సెస్ ఫుల్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కొరియన్ కనకరాజు తన జోరు చూపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కుకి చాలా దగ్గరగా వచ్చేసింది. వీకెండ్ లో అక్కడి బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. వీకెండ్ ముగిసినప్పటికీ ఈ సినిమా మేనియా తగ్గకుండా ముందుకు సాగుతోంది. వర్కింగ్ డేస్ లో కూడా ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బలంగా ఉన్నట్లు బుకింగ్ యాప్స్ ద్వారా తెలుస్తోంది.

సినిమాలోని ఫన్, డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ జనాలకు బాగా కనెక్ట్ అవ్వడంతో వర్డ్ ఆఫ్ మౌత్ బాగా పనిచేస్తోంది. కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రోజులు భారీ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. లాంగ్ రన్ సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ తన మాస్, ప్రయోగత్మక ఎంటర్టైన్మెంట్ తో థియేటర్లలో నవ్వుల పండగ తీసుకొచ్చారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇక రాబోయే రోజుల్లో కలెక్షన్స్ లెక్క ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News