#క్రైసిస్: ఆస్కార్ దర్శకుడి మూవీకే బ్రేక్ ఈవెన్ దక్కలేదంటే!
కోవిడ్ మహమ్మారీ సంక్షోభం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విలయం వినోద పరిశ్రమల్ని అతలా కుతలం చేస్తోంది. హాలీవుడ్ టు బాలీవుడ్ శాండల్వుడ్ టాలీవుడ్ అన్నిచోట్లా పరిస్థితి అదుపుతప్పింది. ఇక ఇలాంటి టైమ్ లో థియేటర్లు తెరవాలని.. డబ్బు సంపాదించాలని ఆలోచిస్తే అంతకంటే తప్పు ఇంకేదీ లేదేమో! టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఊహించినట్టే.. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ క్రైసిస్ అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు.
అందుకు తాజా ఎగ్జాంపుల్ టెనెట్. 2020 ఆగస్టు 26 న ప్రపంచవ్యాప్తంగా డెబ్బైకి పైగా దేశాలలో విడుదలైంది. ఇక ఈ మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయడానికి కారణం.. ఆస్కార్ డైరెక్టర్ కం నిర్మాత క్రిస్టోఫర్ నోలాన్ అంత గొప్ప పర్సనాలిటీ ఇన్వాల్వ్ కావడం. నోలాన్ రూపొందించిన అత్యంత ప్రాచుర్యం పొందిన స్పై థ్రిల్లర్ గా `టెనెట్` కి గొప్ప ప్రచారం దక్కింది.
ఈ చిత్రం రిలీజైన అనంతరం పాజిటివ్ రివ్యూలతో సానుకూల స్పందన వ్యక్తమైనా.. చివరికి ఆశించిన బ్రేక్ ఈవెన్ కూడా దక్కకపోవడం ఆవేదనను కలిగిస్తోంది. అమెరికా సహా ఆస్ట్రేలియా- కెనడా- జపాన్- ఇటలీ - యునైటెడ్ కింగ్ డమ్ వంటి కీలక మార్కెట్ల నుండి బాక్సాఫీస్ ఆదాయం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ రోజు వరకు ఈ చిత్రం కేవలం 270 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది బ్రేక్-ఈవెన్ స్థితిని సాధించడం దాదాపు అసాధ్యం. టెనెట్ బ్యాడ్ టికెటింగ్ చూసిన తరువాత కలత చెందిన వార్నర్ బ్రదర్స్ ప్రపంచవ్యాప్త పంపిణీ కి సందేహిస్తోందట. టెనెట్ తదుపరి థియేట్రికల్ విడుదలను ఇతర దేశాల్లో నిలిపి వేయాలని భావిస్తోందట. రాబర్ట్ ప్యాటిన్సన్- జాన్ డేవిడ్ వాషింగ్టన్- డింపుల్ కపాడియా -ఎలిజబెత్ డెబికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు.