పెళ్లి డేట్ త్వరలో చెప్తా.. అంటున్న యంగ్ హీరో

Update: 2020-04-07 16:30 GMT
'క‌ళ్యాణం వ‌చ్చినా క‌క్కు వ‌చ్చినా ఆగ‌దు’ అనే సామెత ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరోకి వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ రావడంతో ఎక్కడి పెళ్లిలు అక్కడే ఆగిపోయాయి. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ముప్పై దాటి ఇంకా పెళ్లి చేసుకొని హీరోల లిస్ట్ పెద్దదే ఉంది. అయితే ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కుదామనుకున్న హీరోలు.. తమ పెళ్లిలను వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే హీరో నితిన్‌ పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడు హీరో నిఖిల్‌ కూడా ఇదే చేశాడు. ఏ కరోనా నా పెళ్లి ఆపలేదని, మా జంట పెళ్లిని ఏ శక్తీ ఆపలేదు, రెండు కుటుంబాలు ఉంటే చాలు అని చెప్పిన నిఖిల్‌.. ఇప్పుడు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. నిఖిల్ భీమవరంకు చెందిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వితో ఫిబ్రవరిలో నిశ్చితార్ధం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం కూడా నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం కరోనా వైరస్ ముప్పుని తీవ్రంగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది.

రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటం తో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇటీవలే ‘అర్జున్ సురవరం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్, పల్లవికి గోవాలో ప్రపొజ్ చేసి వారి పెద్దల్ని కూడా ఒప్పించి మరి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. పైగా ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. డాక్టర్ పల్లవి వర్మని మొదటిసారి చూసినప్పుడే నిఖిల్ ప్రేమించాడట. మొత్తానికి ప్రేమించిన అమ్మాయినే అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్లి వాయిదా వేయడం వల్ల కుటుంబ సభ్యులు చాలా నిరాశకు లోనయ్యారని, అయినా వారి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది కాబట్టే తన పెళ్లిని వాయిదా వేస్తున్నానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. అయితే పెళ్లి ఎప్పుడనే విషయం గురించి లాక్ డౌన్ ముగిసాక చెప్తానన్నాడట ఈ కుర్ర హీరో
Tags:    

Similar News