బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: సాంగ్‌ మిస్‌!!

Update: 2015-07-10 04:00 GMT
అసలు బాహుబలి సినిమాల్లో మూడు పాటలు తప్పించి మిగిలినవన్నీ అయితే బ్యాగ్రౌండ్‌ సాంగ్స్‌ లేకపోతే బిట్‌ సాంగ్స్‌ అనే విషయం ముందే మనకు తెలుసు. ఆడియో రిలీజ్‌ అప్పుడే ఆ విషయం స్పష్టమైంది. అయితే రాజమౌళి సినిమాల్లో జనాలందరూ ఎక్స్‌పెక్ట్‌ చేసే పాటేంటి? మగధీర, ఈగ వంటి సినిమాల్లో మనోడు ఒక పాటతో కిర్రాకు తెప్పించాడు కాని, సేమ్‌ అలాంటి పాట బాహుబలిలో కూడా ఉంటుందని అనుకుంటే మాత్రం మీరు నిరాశ చెందుతారు.

అవును, మీరు గెస్‌ చేసింది కరక్టే. బాహుబలి సినిమా ఎండింగ్‌లో రోలింగ్‌ క్రెడిట్స్‌ వేసేటప్పుడు అసలు పాటనేదే లేదు. అయితే ఏదైనా సాంగ్‌ను స్పెషల్‌గా రికార్డు చేయించడం, లేకపోతే మేకింగ్‌ వీడియోను చాలా సరిక్రొత్తగా చూపించడం.. ఈ రెండింటిలో రాజమౌళి ఏదో ఒకటి చేస్తాడు. కాని బాహుబలి పార్టు 1 కు మాత్రం రోలింగ్‌ క్రెడిట్స్‌ అంటే కేవలం రోలింగ్‌లో పేర్లు మాత్రమే వేసి వదిలాడు. బహుశా హాలీవుడ్‌ సినిమాల నుండి ఈ విషయంలో కాస్త ఎక్కువ ఇన్‌స్పయిర్‌ అయ్యాడా లేకపోతే సినిమాను ఇంటర్నేషనల్‌ ఆడియన్స్‌ చూస్తారు కాబట్టి ఇలాంటి ఫీట్లు అక్కర్లేదని అనుకున్నాడో.. ఆ ఎండింగ్‌ సాంగ్‌ మాత్రం మిస్‌ అంతే!!

Tags:    

Similar News