• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్డీఎక్స్ పాప.. కెరీర్...

ఆర్డీఎక్స్ పాప.. కెరీర్ డల్ గా ఉందే!

By - Tupaki Desk
Update: 2020-01-03 06:15 GMT
'RX100' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా పాయల్ కు భారీ గుర్తింపు దక్కింది. ఇలా హిట్ తగిలినా చాలామంది హీరోయిన్లు బోల్డ్ ఇమేజ్ కోసం తంటాలు పడుతుంటారు. అయితే పాయల్ కు అలాంటి కష్టం లేకుండా మొదటి సినిమాతోనే ఘాటు ఇమేజ్ తెచ్చుకుంది. యూత్ లో కూడా పాయల్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత చేసిన సినిమాలు నిరాశపరచడంతో మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ కాస్తా పోయింది. ముఖ్యంగా 'RDX లవ్' సినిమా పాయల్ క్రేజ్ ను దెబ్బతీసింది.

అయితే ఈ సమయంలో పాయల్ కు 'వెంకీమామ' రూపంలో మంచి హిట్ దక్కింది. డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో పాయల్ సీనియర్ హీరో వెంకటేష్ కు జోడీగా నటించింది. సినిమా హిట్ అయినా పాయల్ కు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని అంటున్నారు. సహజంగా కెరీర్ ఆరంభంలో సీనియర్ హీరోలతో జోడీ కడితే ఆ హీరోయిన్లతో రోమాన్స్ చేసేందుకు యువ హీరోలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం పాయల్ పరిస్థితి కూడా అలానే ఉందట. ఏజ్ బార్ అయిన హీరోలకు జోడీ దొరక్క పాయల్ ను ఎంపిక చేసుకోవాల్సిందే కానీ యువ హీరోలు ఎవ్వరూ పాయల్ పేరును తమ సినిమాలకు పరిశీలించడం లేదట. దీంతో షాప్ ఒపెనింగులు.. ఛారిటి షోలు అంటూ అటూ ఇటూ తిరుగుతూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫిలిం మేకర్ల కు ఫీలర్లు పంపిస్తోంది.

పాయల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మాస్ మహారాజా రవితేజ సినిమా 'డిస్కోరాజా' మరొకటి తమిళ చిత్రం 'ఏంజెల్'. రవితేజ సినిమా కనుక హిట్ అయితే పాయల్ కెరీర్ కు కొంచెం ఊపు వస్తుందేమో వేచి చూడాలి. లేకపోతే ఇక ఫేడ్ అవుతున్న ఇతర హీరోయిన్ల తరహాలో వెబ్ సీరీస్ వైపు చూడాల్సి ఉంటుంది.


Tags:    
  • Payal Rajput 
  • No New Movies For Payal Rajput 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS