దాసరితో పవన్.. అసలు ఛాన్సుందంటారా?

Update: 2016-07-30 22:30 GMT
దర్శకరత్న దాసరి నారాయణ రావుతో సినిమా చేస్తానంటూ.. అప్పుడెప్పుడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. పవన్ తో సినిమా తీయనున్న మాట రైటే అని.. కానీ తాను దర్శకత్వం చేయడం లేదంటూ చెప్పిన దాసరి.. స్క్రీన్ ప్లే-డైరెక్షన్ బాధ్యతలు వేరే వాళ్లకి ఇస్తానని అంతా పవన్ ఇష్టమేనని చెప్పారు. అసలు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉందా అన్నదే అసలు డౌట్.

దాసరి-పవన్ కాంబో సెట్ చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా అవేవీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పనవ్ డాలీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. దీనికి శరత్ మరార్ నిర్మాత. దీనితర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాధాకృష్ణ నిర్మాతగా సినిమా చేయనున్నాడు పవర్ స్టార్. ఇది కూడా కంప్లీట్ అయ్యాక ఏఎం రత్నం నిర్మాణంలో కోలీవుడ్ దర్శకుడు ఆర్ టి నేసన్ తో పవన్ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూడింటి తర్వాత మైత్రీ మూవీస్ కూడా పవన్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టులన్నిటికీ నిర్మాతలు ఫైనల్ అయిపోతే.. మరి దర్శకరత్న నిర్మాణంలో  సినిమా ఎప్పుడన్నదే ప్రశ్న.

ఎంత ఫాస్ట్ గా చేసినా.. ఈ సినిమాలన్నీ అయ్యేటప్పటికే మరో రెండేళ్లు గడిచిపోతుంది. ఆ తర్వాత పవన్ 2019 ఎలక్షన్స్ కి రెడీ అవుతానని చెప్పేశాడు. ఆ లెక్కన దాసరి వారితో పవన్ సినిమా సాధ్యమేనా అనే డౌట్ రావడం సహజమే కదూ! మధ్యలో ఓసారి దాసరి అడ్వాన్స్ ఇస్తానంటే పవన్ వద్దన్నాడట. బహుశా ఇందుకేనేమో!
Tags:    

Similar News