పల్లెపిల్లనా? .. పాలకుండానా?

Update: 2021-02-24 02:53 GMT
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నివేదా పేతురాజ్ ఒకరు. నివేదలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆమె హైటు అనే చెప్పాలి. విశాలమైన కళ్లు .. అల్లరి చూపులు కూడా ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. అలాంటి నివేద మోడ్రన్ డ్రెస్సుల్లోను .. చీరకట్టులోను చాలా అందంగా .. ఆకర్షణీయంగా ఉంటుంది. బాపుగీసిన బొమ్మలా .. విరబూసిన పూలకొమ్మలా ఉంటుంది. నివేద సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది. మోడ్రన్ ఫొటోలతో కుర్రాళ్ల మనసుల్లో అలజడి సృష్టించే నివేద, ఈ సారి చీరకట్టులోను ఆకట్టుకుంది.

ఈ సారి నివేద వదిలిన ఫొటోలో ఆమె పల్లెపిల్లలా .. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడే తెలుగింటి పిల్లలా కళ్లను కట్టిపడేస్తోంది. ఎర్రచీర .. ఆకుపచ్చ జాకెట్టు .. ఎర్ర గాజులు .. వడ్డాణం .. నిండుగా ధరించింది. జెడలో మల్లెపూలు .. మెడలో హారంతో మెరిసిపోతోంది. అందంగా ఉన్నానా .. అజంతా శిల్పంలా ఉన్నానా? అనే ప్రశ్నను కోనేరంతటి కళ్లతోనే అడుగుతోంది. ఈ విషయం చెప్పడానికి ఇంతసేపా? అన్నట్టుగా బుంగమూతి పెట్టేసింది. పాలకుండలాంటి పిల్ల అలిగితే ఇంకా అందంగా ఉండదూ!
Read more!

'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు తెరకి నివేద పరిచయమైంది. ఈ సినిమాలో ఈ అమ్మాయిని చూసినవాళ్లు అమ్మాయి చాలా కళగా ఉందని మెచ్చుకున్నారు. 'చిత్రలహరి' .. 'బ్రోచేవారేవురా' సక్సెస్ లతో ఈ అమ్మాయి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. 'విరాటపర్వం' .. 'పాగల్' సినిమాలతో త్వరలో ఈ బ్యూటీ పలకరించనుంది. ఈ సుందరికి ఇంకా పడాల్సిన పాత్రలు పడలేదనీ, లేదంటే మరోస్థాయిలో ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అలాంటి స్థాయికి ఈ అందగత్తె ఈ ఏడాదిలోనైనా చేరుకుంటుందేమో చూడాలి.             
Tags:    

Similar News