నితిన్ ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ ఫిక్స్!
నితిన్-కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రంగ్ దే’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా.. ఆ పని కూడా పూర్తిచేసుకొని దాదాపుగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
అయితే.. ఈ సినిమాను ఎలా రిలీజ్ చేయాలనే అంశంలో మేకర్స్ ఎన్నో ఆలోచనలు చేవారు. సంక్రాంతి బరిలో నిలపాలా? లేదంటే ఓటీటీ బాట పట్టాలా? అని తీవ్రంగా ఆలోచించారు. అయితే.. ఆ తర్వాత ఈ థాట్స్ పక్కన పెట్టారు. థియేటర్ లోనే రిలీజ్ చేయాలికానీ.. ఇప్పుడు కాదు అనే నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం థియేటర్లన్నీ తెరుచుకున్నప్పటికీ.. 50 పర్సంట్ ఆక్యుపెన్సీయే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. ఏదైనా తేడావస్తే.. నెత్తిన క్లాత్ వేసుకోవాల్సిందే. అదే.. వందశాతం ఆక్యుపెన్సీతో ఆట వేస్తే.. టాక్ ఎలా ఉన్నా, తొలి వారంలోపు చాలా వరకు వసూళ్లు రాబట్టొచ్చు. ఇదే ఆలోచనతో రంగ్ దే రిలీజ్ సమ్మర్ సీజన్ కు పోస్ట్ పోన్ చేశారట మేకర్స్.
మార్చి నుంచి హండ్రెడ్ పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతి వస్తుందని ఇండస్ట్రీ భావిస్తోంది. అందుకే.. అందరూ మార్చి తరువాత సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ను ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ సినిమాకు రెండు వారాలు ముందుగా ‘రంగ్ దే’ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట. అంటే మార్చి 26 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. ఈ సమయంలో వేసవి సెలవులతోపాటు హోలీ తదితర సెలవులు కూడా కలిసొస్తాయి. అందుకే ఈ డేట్ ఫైనల్ చేసినట్టు సమాచారం.