షాక్‌: ప‌వ‌న్ ని పెళ్లికి వెళ్లొద్ద‌న్న ఫ్యాన్స్‌!

Update: 2020-07-22 06:45 GMT
యూత్ స్టార్ నితిన్ త‌న ప్రేయ‌సి షాలిని కందుకూరిని వివాహ‌మాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 26న హైద‌రాబాద్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ హోట‌ల్లో ఈ జంట వివాహం కుటుంబ స‌భ్యులు.. కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో చాలా సింపుల్ గా జ‌ర‌గ‌నుంది. తొలుత సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లోని ఓ ఫామ్ హౌస్ లో పెళ్లికి ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చార‌మైనా వెన్యూ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ కి షిఫ్ట‌య్యింద‌ని తాజా క‌థ‌నాలు స్ప‌ష్ఠ‌త‌నిస్తున్నాయి.

ఈ పెళ్లి వేడుక‌కు ముఖ్య అతిథుల జాబితాల్ని ఇదివ‌ర‌కూ వెళ్ల‌డించాం. నితిన్ ఫేవ‌రెట్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతుండ‌గా.. ప‌వ‌న్ తో పాటే త్రివిక్ర‌మ్ కూడా ఆశీస్సులు అందించేందుకు విచ్చేస్తున్నార‌ని ఆ ఇద్ద‌రినీ నితిన్ పెళ్లికి ఆహ్వానించార‌ని ప్ర‌చార‌మైంది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఐటీ మంత్రి కేటీఆర్ ల‌ను నితిన్ ఆహ్వానించార‌ని తెలుస్తోంది.

అయితే ప‌వ‌ర్ స్టార్ ఈ పెళ్లికి వెళ్ల‌డం ఫ్యాన్స్ కి ఇష్ఠం లేద‌ట‌. ఎందుకంటే హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అస‌లే  వైర‌స్ మ‌హ‌హ్మారీ ఒణికించేస్తోంది. రోజుకు వంద‌లాది పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూ హ‌డ‌లెత్తిస్తున్నాయి. ఇలాంట‌ప్పుడు పెళ్లి వేడుక‌లు.. విందు అంటే అది ప్ర‌మాద‌క‌రం. త‌మ ఫేవ‌రెట్ కి ఎలాంటి ముప్పు ఉంటుందోన‌నే భ‌యాందోళ‌న‌లో ఫ్యాన్స్ ఉన్నార‌ట‌. అందుకే ఈ పెళ్లికి వెళ్ల‌క‌పోతేనే బెట‌ర్ అని ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టొద్ద‌ని అంటూ కొంద‌రు ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఒక‌వేళ పెళ్లికి వెళితే నితిన్ ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని కూడా సూచిస్తున్నారు మ‌రికొంద‌రు.
Tags:    

Similar News