• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిన్నే నిన్నే: రొమాంటిక్...

నిన్నే నిన్నే: రొమాంటిక్ ఫీల్ తో సాగుతోందే

By - Tupaki Desk
Update: 2019-12-15 06:48 GMT
యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం 'అశ్వథ్థామ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రమణ తేజ రూపొందిస్తున్న ఈ సినిమాను శౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను జనవరి 31 వ తేదీన విడుదల చేస్తామని ఈమధ్యే ప్రకటించారు.  రిలీజ్ వచ్చేనెలలోనే కాబట్టి ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

కాసేపటి క్రితం ఈ సినిమా నుండి 'నిన్నే నిన్నే' అంటూ సాగే మొదటి వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.  ఈ పాటకు సాహిత్యం అందించినవారు రమేష్ వాకచర్ల.  అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడారు.  "నిన్నే నిన్నే యదలో నిన్నే చెలియా నీకై నేనే వేచానులే అలుపే రాదే అదుపే లేదే. అయినా సమయం సరిపోదులే.. " అంటూ ప్రియురాలి గురించి ప్రియుడు పాడే పాట ఇది.  మంచి రొమాంటిక్ ఫీల్ తో సాగింది. నాగశౌర్య- మెహ్రీన్ ల జోడీ ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ అందంగా ఉన్నాయి. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి.

ఈమధ్య ఒక సినిమాకు మంచి హైప్ తీసుకురావడానికి పాటలు చాలా కీలకం అయ్యాయి.  ఆవిధంగా చూస్తే 'అశ్వథ్థామ' సినిమాకు ఈ పాట మంచి స్టార్ట్ అనే చెప్పాలి. మిగతా పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటే 'అశ్వథ్థామ' కు మంచి క్రేజ్ రావడం ఖాయం.


Full View

Tags:    
  • Ninne Ninne Song Promo 
  • Naga Shaurya 
  • Aswathama Movie 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS