హీరో నిఖిల్ కుక్కతో పోల్చింది వర్మ నేనా...?

Update: 2020-07-22 05:45 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్టుగా 'పవర్ స్టార్' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలిన ప్రవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో చూపించాడు వర్మ. ఇప్పటికే ఫస్ట్ లుక్ మరియు 'గడ్డి తింటావా' అనే సాంగ్ రిలీజ్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ సినిమా నిజ జీవితంలోనే ఏ వ్యక్తిని ఉద్దేశించి తీసింది కాదని.. పార్టీ పెట్టి ఓడిపోయిన ఓ స్టార్ హీరోతో తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ అని.. ఎవరికైనా దగ్గరి పోలికలు ఉంటే ఇది యాదృచ్చికంగా జరిగింది మాత్రమే అని చెప్పుకొచ్చాడు. వర్మ ఎంత చెప్పినా అది పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీస్తున్న సినిమా అని అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు 'పవర్ స్టార్' ట్రైలర్ పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ట్రైలర్ ముందే లీక్ అవడంతో చేసేదేమి లేక రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ ట్రైలర్ ఒక గంట ముందే యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు. ఇప్పటికి ట్రైలర్ కి డబ్బులు చెల్లించినవారికి వెనక్కి ఇచ్చేస్తాని ప్రకటించారు.

ఇదిలా ఉండగా 'పవర్ స్టార్' ట్రైలర్ లీక్ అయినప్పటి నుంచి అది చూసిన ప్రతి పవర్ స్టార్ అభిమాని వర్మపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ చూపించిన ఈ ట్రైలర్ చూసి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని అభిమానించే సినీ ప్రముఖులు కూడా వర్మపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ యువ హీరో నిఖిల్ చేసిన ట్వీట్ వర్మను ఉద్దేశిస్తూ చేసిందేనా అనే అనుమానం కలుగుతోంది. ''శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయిందిగా'' అంటూ ట్వీట్ పెట్టారు నిఖిల్. దీనికి 'పవర్ స్టార్' 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించి 'బంగారం' సినిమాలోని పవన్ కళ్యాణ్ గిఫ్ జత చేసాడు.

నిఖిల్ కుక్కతో కంపేర్ చేసింది రామ్ గోపాల్ వర్మని అని చెప్పకపోయినా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. వర్మ నే టార్గెట్ చేసిందని అందరికి ఈజీగా తెలిసిపోతుంది. అందులోనూ 'మీకు అర్థం అయిందిగా' అని నిఖిల్ అనడంతో అర్థం అయింది అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు హీరో నిఖిల్ ఏకంగా వర్మను కుక్కతో పోల్చడం టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. దీనిపై నెటిజన్స్ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిఖిల్ కి మద్ధతుగా నిలుస్తుండగా.. న్యూట్రల్ ఫ్యాన్స్ మాత్రం స్టార్ డైరెక్టర్ ని అలా కామెంట్ చేయడం తగదని అంటున్నారు. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News