పోలీసులు హీరోలు అని రౌడీ చెబితే కానీ తెలీదా?
రౌడీ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సైలెన్స్ మెయింటెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్ లో శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ ఇంటికి సమీపంలో కొత్త ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి రౌడీ ఆ ఇంట్లోనే తన ఖాళీ సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే అంకితమైపోయాడు. స్వీయ నిర్భంధంలో ఉన్నాడు.
అయితే టాలీవుడ్ హీరోలంతా కరోనా సాయం పేరుతో పేద కార్మికుల్ని ఆదుకునేందుకు భారీగా విరాళాల్ని ప్రకటిస్తే రౌడీ నుంచి ఏ ప్రకటనా రాకపోవడంతో యాంటీ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాల్లో ట్రోల్స్ ఆగలేదు. ఇలాంటి టైమ్ లో స్పందించడా? అంటూ డైరెక్టుగానే తిట్టేశారు. కరోనాపై అవేర్ నెస్ వీడియో చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అని విమర్శించారు.
అదంతా సరే కానీ.. కొంత సైలెన్స్ తర్వాత దానిని బ్రేక్ చేస్తూ విజయ్ దేవరకొండ హైదరాబాద్ పోలీస్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి అటెండయ్యాడు. సిటీ పోలీస్ కమీషనర్ అంజని కుమార్ సమక్షంలో లాక్ డౌన్ పీరియడ్ లో పోలీసులు ఎలా రియల్ హీరోలు అయ్యారో చెప్పాడు. అయితే ఈ యాక్టివిటీ పై నెటిజనుల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది రౌడీతో పాటు పోలీసుల్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. పోలీసులు హీరోలు అని చెప్పేందుకు రౌడీనే కావాలా? సెలబ్రిటీ సాయం లేనిదే గుర్తించరా? అంటూ ట్రోల్స్ తో విరుచుకు పడ్డారు. వాస్తవానికి కరోనా సాయం లో హెల్త్ డిపార్ట్ మెంట్.. పోలీస్ డిపార్ట్ మెంట్ సేవల్ని ఇప్పటికే జనం గుర్తించారు. వీరి సేవల్ని కొనియాడుతూనే రియల్ హీరోస్ అంటూ మెప్పుకోలుగా చూస్తున్నారు.
ఏదో ఒకటి చేసి నెటిజనులచే చీవాట్లు తినడం అలవాటై పోయిన దేవరకొండకు బహుశా ఈ కామెంట్లు పెద్దగా పట్టించుకునేవి కాకపోవచ్చు కానీ.. తన వీరాభిమానులు మాత్రం కలతకు గురవుతున్నారు. అన్నట్టు లాక్ డౌన్ వల్ల ముంబైలో తెరకెక్కాల్సిన `ఫైటర్` షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా ముంబై నగరం సహా మహారాష్ట్రను ఒణికిస్తోంది. ఇప్పట్లో అక్కడ పరిస్థితులు దారికి వచ్చేట్టు కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా షెడ్యూల్ ని ముంబై లో కాకుండా వేరొక చోటికి షిఫ్ట్ చేయాల్సిన సన్నివేశం ఉంది. మరి విజయ్- పూరి-ఛార్మి బృందం ఎలాంటి ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉందింకా.