రష్మిక మైండ్ బ్లాంక్ చేసిన నెటిజన్స్
రష్మిక మందన్నా ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను మరియు ఫాలోవర్స్ ను ఉద్దేశించి మీరు నా నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు. నేను ఎలాంటి సినిమాల్లో నటిస్తే చూడాలనుకుంటున్నాను.. నన్ను ఎలాంటి పాత్రలు చేయమంటారు చెప్పండి అలాంటి సినిమాలు పాత్రలు చేసేందుకు నేను ప్రయత్నిస్తాను అంటూ ప్రకటించింది. ఆమె పోస్ట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. వందల మంది ఆమెకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సలహాలు సూచనలతో రష్మిక జుట్టు పీక్కుని ఉంటుంది.
కొందరు ఆకతాయి నెటిజన్స్ నీవు సినిమాల్లో నటించకుండా ఉండటమే మంచిది. అదే అభిమానులకు మరియు మాకు ఇచ్చే పెద్ద బహుమానం అంటూ కామెంట్ పెట్టగా మరికొందరు మీరు హర్రర్ సినిమాల్లో నటించండి భలే నవ్విస్తారు.. కామెడీగా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక మరికొందరు అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా పుష్ప గురించి స్పందించారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మాదిరిగా పుష్ప చిత్రంలో అతి చేయకుండా ఉంటే చాలు అన్నారు.
అల్లు అర్జున్ సినిమాలో మీరు నటిస్తున్నారు అంటేనే ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందుతున్నారు. అందుకే మీరు గత చిత్రాల్లో మాదిరిగా ఓవర్ యాక్షణ్ చేయకుండా ఉండండి. అల్లు అర్జున్ పరువు తీసేలా మాత్రం చేయకండి ప్లీజ్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి నెటిజన్స్ ను సలహా అడిగినందుకు రష్మిక తల బొప్ప కట్టేలా చేశారు. మరోసారి ఇలాంటి సలహాలు రష్మిక అడగక పోవచ్చు అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.