• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెటిజన్ల పనికి సంచలనాల...

నెటిజన్ల పనికి సంచలనాల కంగనా 'వర్రీ '

By - Tupaki Desk
Update: 2020-08-31 08:30 GMT
ఎక్కడ వివాదం ఉంటుందో కంగనా రనౌత్ అక్కడ ఉంటుంది. ఆమెకు నోరు పెద్దదే అనే టాక్ ఉంది. ఆమె ఎవరినీ వదలి పెట్టదు. అందరినీ ఓ రౌండ్ వేస్తుంటుంది. ఇక తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఇలాంటి   కంగనా కు ఫ్యాన్స్, నెటిజన్లు షాకులు ఇస్తూ ట్విట్టర్ లో అన్ ఫాలో అవుతుండటంతో ఈ బాలీవుడ్ క్వీన్ తెగ ఫీల్ అవుతోంది. అన్ ఫాలో అంటే మరీ సాదా సీదాగా కాదు రోజుకు 40 వేల నుంచి 50 వేల  మంది వెళ్లి పోతుండటంతో కంగనా ఆందోళన చెందుతోంది.  ఇటీవల కంగనా ప్రతి విషయాన్ని వివాదం చేస్తూ ట్వీట్లు చేస్తోంది.  అది నచ్చకే చాలా మంది ఆమె ట్విట్టర్ నుంచి అన్ ఫాలో  అవుతున్నారు. సుశాంత్ సింగ్  రాజ్ పుత్ చనిపోయినప్పటి నుంచి లెక్కలేనన్ని ట్వీట్లు చేస్తోంది కంగనా. సుశాంత్ మరణానికి బాలీవుడ్ లోని నెపోటిజమే కారణమంటూ అందరినీ ఏకిపారేసింది.

 హృతిక్ రోషన్, అలియాభట్, మహేష్ భట్, కరణ్ జోహార్, వినోద్ పంచోలీ, తాప్సి మహారాష్ట్ర సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రే.. ఇలా పలువురిపై ఇటీవల ట్వీట్ల వార్ కొనసాగిస్తోంది. ముందు  ట్విట్టర్ లోకి ప్రవేశించి యాక్టివ్ గా ఉన్న  కంగనా ఆ తర్వాత ఖాతాను మూసేసింది. రీ ఎంట్రీ ఇచ్చాక రెగ్యులర్ గా ట్వీట్లు పెడుతూ తన ఫాలోవర్లను ఒక మిలియన్ కు పెంచుకుంది. ఇటీవలి కాలంలో కంగనా ప్రతి నటి, నటున్ని  టార్గెట్ చేసి ట్వీట్లు వేస్తోంది. తాప్సి వంటి వారు దీటుగా బదులిస్తున్నా  కంగనా ఏ మాత్రం తగ్గడం లేదు. కంగనా అందరితో గొడవ పెట్టుకోవడమే పనిగా పెట్టు కోవడంతో జనాలకు కూడా రోజూ ఇదే పనా.. అంటూ విసుగు చెందుతున్నారు. ఆమెను అన్ ఫాలో అవుతున్నారు. మరో వైపు రోజుకు ఇంత మంది అన్ ఫాలో అవుతుండటంతో దీనికి కారణం ఏంటో చెప్పాలని  ఏకంగా ట్విట్టర్ ఇండియా ఖాతాను ట్యాగ్ చేస్తూ కంగనా ట్వీట్ చేసింది. ట్విట్టర్లో అందరినీ ఆడుకునే  కంగనా.. ఈ సారి ట్విట్టర్ ని కూడా వదల్లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS