బండ్లని సైడ్ చేసిన హరీష్ శంకర్...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ 'దబాంగ్' సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పవర్ స్టార్ అభిమానులు #8yearsforgabbarsinghhystiria అనే హ్యాష్ ట్యాగ్ తో హడావుడి చేసారు. ఈ సందర్భంగా పీకే ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపిన హరీష్ శంకర్ ఆ చిత్రంతో తనకున్న మెమొరీస్ తెలియజేస్తూ ఓ లెటర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ నిన్న మొన్ననే జరిగిన ఫీలింగ్ తనకు ఉందని.. సోషల్ మీడియా పుణ్యమా అని గబ్బర్ సింగ్ చిత్ర జ్ఞాపకాలు జ్ఞాపకాలు ప్రతి ఏడాది తనతోనే ఉంటున్నాయని.. ఈ చిత్రంలో ఆన్ స్క్రీన్ హీరో పవర్ స్టార్ అయితే ఆఫ్ స్రీన్ హీరో దేవిశ్రీ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం విడుదలై 8 ఏళ్ళు గడచిపోయిందా అనే ఆశ్చర్యంతో పాటు.. పవర్ స్టార్ తో పనిచేసి 8 ఏళ్ళు గడచిపోయిందని ఆందోళనగా కూడా ఉందని పేర్కొన్నాడు. ఈ స్టోరీ రాయడానికి సహాయపడిన రైటర్స్ సతీష్ వేగ్నేష్ - రమేష్ రెడ్డిలకు.. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజశేఖర్ - విజయ్ - బాబీ లకు.. సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ - ఎడిటర్ గౌతమ్ రాజు - ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేసారు. 'ఇప్పుడే మొదలైంది.. మేము మళ్ళీ తిరిగొస్తున్నాం' అంటూ లెటర్ ముగించాడు హరీష్ శంకర్. ఈ లెటర్ చూసిన పవర్ స్టార్ అభిమానులు ఉప్పొంగి పోయారు. అయితే ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
'గబ్బర్ సింగ్' చిత్రానికి సంబందించిన ప్రతి ఒక్కరిని పేరు పేరునా ప్రస్తావించిన హరీష్ శంకర్.. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ని.. హీరోయిన్ శృతి హాసన్ ని విస్మరించడం అనుమానాలకు కారణమైంది. ముఖ్యంగా సినిమాకి కష్టపడిన అందరి పేర్లను మెన్షన్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్.. కోట్లు ఖర్చు పెట్టి సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ ని ఎలా మర్చిపోయాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేష్ పేరు లేకపోవడంతో వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. గబ్బర్ సింగ్ తర్వాత ఏమైనా మనస్పర్థలు వచ్చాయా.. అందుకే హరీష్ శంకర్ బండ్ల పేరును లైట్ తీసుకున్నాడా అనే అనుమానాలను సినీ అభిమానులు వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'మా బండ్లన్న పేరును ఎలా మర్చిపోయావ్' అంటూ బండ్ల గణేష్ ఫ్యాన్స్ డైరెక్టర్ ని అడుగుతున్నారు.
నిజానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి అంత క్లోజ్ అవ్వడానికి కారణమే బండ్ల గణేష్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి హరీష్ పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్లని ఎందుకు సైడ్ చేసారో ఆయనకే తెలియాలి. అయితే బండ్ల గణేష్ తో పాటు హీరోయిన్ శృతి హాసన్ పేరు కూడా మెన్షన్ చేయలేదు హరీష్. అయినా అందరూ శృతి హాసన్ గురించి వదిలేసి బండ్ల గణేష్ ని ఎందుకు విస్మరించారు అంటూ ప్రశ్నించడం విశేషం. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ కూడా 'గబ్బర్ సింగ్' చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.