దారుణ వేధింపులపై బోరుమన్న సీనియర్ హీరోయిన్
ప్రీతిజింటా.. అప్పట్లో వెంకటేశ్, మహేష్ బాబుతో నటించిన బాలీవుడ్ హీరోయిన్. తెలుగు కంటే హిందీలో సినిమాలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పారిశ్రామికవేత్త నెస్ వాడియాతో ప్రేమలోపడి డేటింగ్ చేస్తూ ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును కొని నడిపించింది.
తాజాగా నెస్ వాడియాతో ప్రీతిజింటాకు విభేదాలు రావడం.. కొట్టుకోవడం.. పోలీసుల కేసుల వరకు వెళ్లడంతో ఈ వివాదం మీడియాలో రచ్చరచ్చ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రీతిజింటా దారుణ కామెంట్స్ చేసింది. 2014లో పంజాబ్ , చెన్నై మ్యాచ్ లో తన పట్ల నెస్ దురుసుగా ప్రవర్తించి టీం సభ్యుల ముందే తిట్టాడని.. ప్రీతిజింటా ఆరోపించింది. వివాదం అప్పుడే మొదలైందని తెలిపింది. జట్టు మేనేజ్ మెంట్ విషయంలో మా మధ్య విభేదాలువచ్చాయని.. నెస్ తనపై దారుణంగా దుర్భాషలాడాడని.. మానసికంగా క్షోభ పెట్టాడని ప్రీతి జింటా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఇక అంతేకాదు.. తన పలుకుబడితో తనను బెదిరించాడని.. చంపేస్తానని హెచ్చరించాడని ప్రీతిజింటా ఫిర్యాదులో ఆరోపించింది.వాంఖడే ముంబై స్టేడియంలో మరోసారి తనను ఇలాగే హెచ్చరించాడని వాపోయింది.
దీంతో ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాకు లేఖ రాసి తన ప్రాణాలకు నెస్ వల్ల ముప్పు ఉందని ఆమె ఫిర్యాదు చేసింది. సిగరెట్ కాల్చి నా ముఖంపైన విసిరాడని.. గదిలో బంధించి కొట్టాడని.. నన్ను చంపడానికైనా సిద్ధంగా ఉన్నాడని.. నాకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండని లేఖలో కోరింది.
అయితే ప్రీతి జింటా చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నెస్ వాడియా మీడియా వివరణ ఇచ్చాడు. ఆమె చెప్పినందంతా అబద్దం అని తెలిపాడు. 2018లో కోర్టు సూచన మేరకు వీరిద్దరూ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకున్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరూ కింగ్స్ ఎలెవన్ సహ యజమానులుగా ఇంకా కొనసాగుతుండడం విశేషం.