నెపొటిజం : నాన్న నాకోసం ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు

Update: 2020-11-09 00:30 GMT
బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపొటిజం. సుశాంత్‌ మృతి తర్వాత దీని గురించిన చర్చ మరింత ఎక్కువ అయ్యింది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు నెపొటిజం గురించి తెగ మాట్లాడేస్తున్నారు. స్టార్‌ వారసులు ఈమద్య కాలంలో ఘోరంగా టార్గెట్‌ అవుతున్నారు. ప్రతిభ లేని వారు కూడా బంధు ప్రీతి కారణంగా తమ వారు ఇండస్ట్రీలో ఉండటం వల్ల ప్రేక్షకుల మీదకు ఎక్కి కూర్చునేందుకు వస్తున్నారు అంటూ ఆరోపణలు నెట్టింట తెగ కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గత కొన్ని రోజులుగా తన గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ కు.. బిగ్‌ బచ్చన్‌ చాలా డబ్బులు ఖర్చు పెట్టినా చోటా బచ్చన్‌ హీరోగా సెటిల్‌ అవ్వలేక పోయాడు అంటూ చేస్తున్న కామెంట్స్‌ కు సమాధానం ఇచ్చాడు.

నెపొటిజం విమర్శలపై జూనియర్‌ బచ్చన్‌ స్పందిస్తూ... ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఎవరు ఒకరిని స్టార్‌ చేయలేరు. నేను హీరోగా ఎదగడం కోసం నాన్న ఎప్పుడు సాయం చేయలేదు. ముఖ్యంగా నేను నటించిన సినిమాల కోసం ఆయన ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నన్ను హీరోగా పెట్టి ఆయన సినిమాలు తీశాడని అంటున్నారు. కాని ఇప్పటి వరకు కూడా ఆయన నా కోసం ఖర్చు పెట్టలేదు. నేను ఆయనతో 'పా' సినిమాను నిర్మించాను. నా డబ్బులతో నాన్న కోసం సినిమాను తీశాను అంటూ చెప్పుకొచ్చాడు. నెపొటిజం అంటూ తనను ట్రోల్‌ చేస్తున్న వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News