పనిపై దృష్టి పెట్టండి పురుషులపై కాదు

Update: 2021-06-27 00:30 GMT
బాలీవుడ్‌ లో ఒకానొక సమయంలో వెలుగు వెలిగిన స్టార్‌ నటి నీనా గుప్తా. ఈమె కెరీర్‌ లో చాలా స్పీడ్ గా దూసుకు పోతు స్టార్‌ హీరోల సినిమా ల్లో నటిస్తున్న సమయంలో అనూహ్యంగా సినిమా లకు దూరం అయ్యారు. సినిమా ల్లో నటించేందుకు ఆ తర్వాత కూడా పలు ఆఫర్లు వచ్చినా కూడా నీనా గుప్తా మాత్రం వాటిని సున్నితంగా తిరష్కరించారు. ఇన్నాళ్లు ఆమె సినిమా లకు దూరంగా ఉండటంకు కారణం ఏమై ఉంటుందా అంటూ అనేక రకాలుగా అనుమానాలు పుకార్లు వినిపించాయి. ఎట్టకేలకు ఆ విషయమై నీనా రాసుకున్న బయోపిక్ 'సచ్‌ కహున్‌ తో' తో సమాధానం లభించింది.

నటిగా బిజీగా ఉన్న సమయంలోనే నేను నా జీవితం తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఒక తప్పుడు వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించడం వల్ల నా సినీ కెరీర్‌ పై ప్రభావం పడింది. అందుకే నటిగా సక్సెస్‌ లు దక్కించుకుంటూ ఉన్నా కూడా సినిమాలకు దూరం అయ్యాను. ఆ సమయంలో చాలా బాధ పడ్డాను కాని ఆ వ్యక్తి వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. సినిమా లకు దూరం అయిన నిర్ణయం విషయంలో ఎప్పుడు కూడా తనను తాను సమర్థించుకోవాలని భావించడం లేదని ఆమె చెప్పుకొచ్చింది. జీవిత భాగస్వామి విషయంలో ఈతరం మహిళలకు ఒక ఆసక్తికర మెసేజ్ ను కూడా ఇవ్వాలనుకుంటున్నాను అంటూ నీనా గుప్తా.. మీరు చేసే పని పై ఎక్కువ దృష్టి పెట్టాలే కాని.. మన జీవితంను ప్రభావితం చేసే పురుషులపై పెట్టకండి. అలా జరిగితే మొత్తం కెరీర్‌ పై ప్రభావం ఉంటుందని ఆమె సూచించింది.

ఇక తన బయోపిక్ సచ్‌ కహున్‌ లో మరో విషయాన్ని కూడా ప్రస్థావించింది. తన కెరీర్‌ ఆరంభంలో శ్యామ్‌ ఆహుజా అనే వ్యక్తి షాప్ లో  సేల్స్‌ గర్ల్‌ గా పని చేస్తున్నట్లుగా ఒక మ్యాగజైన్ లో కథనం వచ్చింది. ఆ కథనం వచ్చే వరకు కూడా తనకు శ్యామ్‌ ఆహుజా అనే వ్యక్తి తెలియదు. అలా ఎలాంటి సంబంధం లేని కథనాలు ఎలా రాస్తారో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ఆ కథనం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు నేను ఎందుకు ఆయన కార్పెట్‌ షాప్ లో పని చేస్తానంటూ మరోసారి అప్పటి కథనంను నీనా గుప్తా కొట్టిపారేసింది.
Tags:    

Similar News