బాలయ్యను 'నాన్న'అన్నది అందుకు కాదు
మొన్న ఒక తమిళ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరొయిన్ నయనతార బాలకృష్ణ తనకు తండ్రి లాంటి వారు అని చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఆయన సరసన మూడు సినిమాల్లో జంటగా అందులోనూ భార్యగా నటించిన నయన్ ఇలా మాట్లాడి ఉండకూడదు అని కొందరు ఫాన్స్ మండిపడ్డారు. నిజానికి నయనతార ఉద్దేశం ఏదైనప్పటికీ మీనింగ్ మాత్రం ఇంకోలా కన్వే కావడం ఇబ్బందులుకు దారి తీసింది. వయసుని లెక్కలోకి తీసుకుంటే బాలయ్య కూతురి వయసే నయనతారకు ఉంటుంది. అంత మాత్రాన సినిమాల్లో కూడా దాని ప్రాతిపాదికన పాత్రలను డిసైడ్ చేయరు. సినిమా వేరు వ్యక్తిగత జీవితం వేరు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి తర్వాత వేటగాడు లాంటి సినిమాల్లో ఆయన పక్కనే డ్యూయెట్స్ లో ఆడి పాడింది.
అవన్నీ సినిమా వరకే పరిమితం. నిజ జీవితానికి వస్తే హీరోలైనా హీరొయిన్ లైనా తమ వయసుకు తగ్గట్టు అవతలి వారి హోదా - ఏజ్ - ఇమేజ్ కి తగ్గట్టు రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తారు. నయనతార అన్నది కూడా ఆ మీనింగ్ లోనే. బాలయ్య తనకు తండ్రిలా గైడ్ చేస్తూ మార్గదర్శకత్వం చేస్తారని చెప్పే ప్రయత్నం చేసింది. అంతే తప్ప ఆయన నాకు నాన్న అని కాదు. పైగా హీరో బాలకృష్ణ ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ తో ఉంటారు. తన కెరీర్ లో శ్రీదేవి ని హీరొయిన్ గా చేయని కారణం నాన్న గారితో ఆడిపాడిన ఆవిడని తన పక్కన ఊహించుకోలేకే. తెలుగులో అందరి అగ్ర హీరోల సరసన చేసినా శ్రీదేవి ఒక్క బాలకృష్ణతో మాత్రమే సినిమా చేయలేకపోయింది. అలాంటిది బాలకృష్ణను నాన్న అని నయనతార చెప్పేసరికి అర్థాన్ని అపార్థం చేసుకున్నారు తప్ప అంతకు మించి ఏమి లేదు. జైసింహలో బాలకృష్ణతో మూడో సారి జోడి కట్టిన నయన్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్.