సూపర్ స్టార్ తో లేడీ సూపర్ స్టార్!!

Update: 2018-03-30 06:10 GMT
ఇప్పుడు దక్షిణాది మొత్తం మీద అత్యంత క్రేజీ హీరోయిన్ ఎవరు.. టాప్ స్టేటస్ ను అనుభవిస్తున్న భామ ఎవరు అంటే.. నయనతార అనే సమధానం టక్కుమని చెప్పేయచ్చు. కానీ ఈమెకు ఇంతగా క్రేజ్ రావడానికి.. అసలు నయన్ ను అందరూ తెగ గుర్తు పెట్టేసుకోవడానికి కారణం.. రజినీకాంత్ మూవీ చంద్రముఖి.

ఆ సినిమాలో రజనీకి జోడీగా నటించిన తర్వాతే నయన్ బాగా ఫేమస్ అయింది. ఆ కృతజ్ఞతతో ఆ తర్వాత కూడా ఈ భామ సూపర్ స్టార్ తో కలిసి నటించింది. అదే కథానాయకుడు మూవీ. అందులో చిన్న పాత్రే అయినా తళుక్కున మెరిసింది నయనతార. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ కాంబినేషన్ ను తెరపై చూసే అవకాశం దక్కలేదు. ఇప్పుడు చంద్రముఖి కాంబో రిపీట్ కానుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవైపు కాలాను.. మరోవైపు రోబో మూవీని పూర్తి చేసిన రజినీకాంత్.. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ అనే యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నయన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈమెతో అగ్రిమెంట్ అయిందా లేదా అనే విషయం మాత్రం యూనిట్ వర్గాలు చెప్పడం లేదు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నయనతార.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి సినిమా చేస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదూ.


Tags:    

Similar News