• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ యంగ్ హీరో అక్కడైనా...

ఆ యంగ్ హీరో అక్కడైనా సక్సెస్ సాధిస్తాడా...?

By - Tupaki Desk
Update: 2020-05-19 07:10 GMT
'సంభవామి యుగే యుగే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన నవీన్ చంద్ర 'అందాలరాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ఒకవైపు అవకాశం దొరికినప్పుడు హీరోగా నటిస్తూనే విలన్ కూడా నటిస్తూ వస్తున్నాడు. 'దళం' 'త్రిపుర' 'నేను లోకల్' 'ఎవరు' చిత్రాలు నవీన్ చంద్రకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక 'అరవింద సమేత వీర రాఘవ' 'దేవదాస్' సినిమాలలో నెగటివ్ రోల్స్ చేసి అలరించాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు చిత్రాల్లో నటించిన నవీన్ చంద్ర ధనుష్ హీరోగా నటించిన 'పటాస్' సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా మెప్పించాడు. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మిస్ ఇండియా' సినిమాలో నటిస్తున్నాడు. ఇలా కథా నాయకుడు ప్రతినాయకుడు అని తేడా లేకుండా క్యారెక్ట‌ర్ న‌చ్చితే చాలు న‌టించ‌డానికి న‌వీన్ చంద్ర ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే చెప్పేస్తున్నాడు. అదే త‌ర‌హాలో ఇప్పుడు ట్రెండ్‌ కు అనుగుణంగా 'భానుమతి రామకృష్ణ' వెబ్ మూవీలోనూ న‌టించేశాడు.

వెబ్ ఫిల్మ్ లో నవీన్ చంద్రతో పాటు సలోని లుథ్రా, రాజా చెంబోలు, హర్ష ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్ మరియు హ్యాండ్‌ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. రీసెంటుగా విడుదలైన ఈ వెబ్ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. సిటీలోని అమ్మాయి.. తెనాలి నుండి సిటీకి వ‌చ్చిన అబ్బాయి మ‌ధ్య ప్రేమ ఎలా పుట్టిందనే క‌థాంశంతో ఈ మూవీ రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ ఓటీటీ యాజమాన్యానికి చూపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మ‌రి న‌వీన్ చంద్ర‌కు 'భానుమ‌తి రామ‌కృష్ణ‌' వెబ్ మూవీ ఎంత పేరు తెస్తుందో చూడాలి.
Full View
Tags:    
  • Busy days for Naveen Chandra 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

అనుమ‌తి లేకుండా బయోపిక్‌లు తీయ‌డం ఎంత రిస్క్ అంటే?

2026-11-09 10:40 GMT

గాడ్ ఆఫ్ వార్ పై ఊహించ‌ని సందేహాలు!

2026-11-09 10:30 GMT

చిన్న సినిమాలను ఆదరించేది ఎప్పుడు?

2026-11-09 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS