హాస్పిటల్ పాలు చేసింది ఆ నిర్మాతే

Update: 2016-08-29 04:50 GMT
నిర్మాతలు నట్టి కుమార్.. సి కళ్యాణ్ ల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కి నయీంతో సంబంధాలున్నాయని నట్టి కుమార్ కామెంట్ చేయడం.. నట్టి కుమార్ వేధింపుల లిస్ట్ తీస్తే.. నయీంకి మించిపోతాడని సి కళ్యాణ్ రిటార్ట్  ఇవ్వడం జరిగిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు నట్టికుమార్ హాస్పిటల్ పాలయ్యారు.

'మా నాన్న ఎవరినీ మోసం చేయలేదు. అసలు మా నాన్న ఇబ్బంది పెట్టిన బాధితులు ఎవరూ ఉంటారు. అలాంటివాళ్లెవరైనా ఉంటే.. చెల్లింపులు చేసేస్తాం' అంటూ నట్టి కుమార్ కొడుకు క్రాంతి.. కూతురు కరుణ ఆరోపించారు. అంతే కాదు.. సి కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే.. తమ తండ్రి ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. నట్టికుమార్ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే. వీరిద్దరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ.. కళ్యాణ్ పై విరుచుకపడ్డారు.

తమ తండ్రి చేసిన ఆరోపణలు నిజమో కాదో తేల్చకుండానే.. ఆయనపై నోరు పారేసుకున్నారని.. నాన్న డిశ్చార్ఛ్ అయి వచ్చాక.. ఆధారాలతో సహా తను చెప్పినవన్నీ నిరూపిస్తారని అంటున్నారు నట్టికుమార్ వారసులు.
Tags:    

Similar News