`నాట‌కం` ఫేం స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌

Update: 2020-11-08 12:10 GMT
‘నాట‌కం’ ఫేమ్ ఆశిష్ గాంధీ.. ‘రంగుల‌రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొంద‌నుంది. రాజ్‌కుమార్ బాబీ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.    

``ఇదొక స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌. సినిమా ప్రారంభ స‌న్నివేశం నుంచి ఆఖ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ క‌థ‌లోని మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తాయి`` అని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఇత‌ర తారాగ‌ణం వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రాజ‌మండ్రి- కాకినాడ‌- నిడ‌ద‌వోలు-  రంప‌చోడ‌వ‌రం- గుడిసె - రాజాన‌గ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతాం`` అని తెలిపారు.

ఈ చిత్రానికి బాబీ ఏడిద క‌థ అందించ‌గా.. స‌ర‌దా శ్యా‌మ్ ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. హ‌రిక్రిష్ణ (బెంగ‌ళూర్‌) ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నారు. పెద్ద‌ప‌ల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. బాబీ ఏడిద‌- రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News