అచ్చ‌మైన తెలుగు సంస్కృతిని గుర్తు చేయనున్న నాని..!

Update: 2021-02-13 14:30 GMT
నేచుర‌ల్ స్టార్ నాని - డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ''టక్ జగదీష్''. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమా కుటుంబం - మూలాలు - అచ్చ‌మైన తెలుగు సంస్క్ర‌తి త‌దిత‌ర అంశాలతో రెడీ అవుతోందని టాక్ నడుస్తోంది.

'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సినిమాతో సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ.. ఈసారి త‌న ల‌క్కీ ఫార్మాట్ లవ్ అండ్ బ్రేకప్ నుంచి బ‌య‌టకొచ్చి 'ట‌క్ జ‌గ‌దీష్' తీస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం ఇది 'బ్ర‌హ్మోత్సవం' సినిమా తరహాలో మరీ అంత ల్యాగ్ లేకుండా ఉంటుందని అంటున్నారు. నాని నటిస్తున్న ఈ 26వ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు.
Tags:    

Similar News