నాని సినిమా టైటిళ్లు ...జనాల నోట నానీ..

Update: 2022-01-12 14:30 GMT
నాని...నటనలో సహజత్వం అతని సొంతం. నేచురల్ స్టార్ గా సకుటుంబ సపరివారానికి అచిరకాలంలోనే చేరువయ్యాడు.  నటనలోతనదంటూ చెరగని ముద్రవేసుకున్నాడు. ద్వితీయ శ్రేణి నటునిగా తన ప్రస్థానం ప్రారంభించి అగ్రనటుల జాబితాలో చేరాడు. కామెడీ, రౌద్రం, సున్నిత భావాలనొలికించే సన్నివైశాలను సైతం అలవోకగా పండిస్తాడు. ' నటనంటే ఇంత ఈజీనా ' అనిపించేలా మైమరిపించడంలో ఈ నేచురల్ స్టార్ తనకు తానే సాటి. అందుకే అతని సినిమాలంటే ఆబాలగోపాలానికి ఆత్రమెక్కువ.

అయితే నాని తన టాలెంట్ తోపాటు తాను ఎంచుకున్న కథతోపాటు కథకు సరితూగే  టైటిళ్లు ఖరారు చేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తాడనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. చిత్ర నిర్మాణం ప్రారంభమవగానే కథకి సరితూగే పేరును పెట్టడంలో ముందుంటాడన్నది ఫిల్మ్ నగర్లో అందరినోటా వినిపిస్తుంటుంది. కాగా తన సినిమాకు ఏ పేరు ఖరారుచేస్తాడో..దాన్నే చిత్ర యూనిట్ అంతా ముక్త కంఠంతో ఫిక్స్ చేస్తారట. ఎందుకంటే నాని సూచించిన పేరు అంతగా జనాల్లోకి  చేరుకునేలా ఉంటుందన్నది వారి నమ్మకం. ఓరకంగా చెప్పాలంటే ఈ మాటలు నూటికి నూరు పాళ్లు నిజమే అనడంలో అతిశయోక్తి లేదన్నది స్పష్టమవుతోంది.
Read more!

అష్టాచెమ్మా నుంచి శ్యామ్ సింగరాయ్ దాకా..." ''

అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు పనిచేసిన నాని 2008లో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. అష్టాచెమ్మా తో కథనాయకుడిగా అన్ని వర్గాలకూ చేరువయ్యాడు. అలా మొదటి చిత్రం అష్టాచెమ్మా నుంచి  మొన్న విడుదలైన శ్యామ్ సింగరాయ్ర,  ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న అంతే ..సుందరానికి, వచ్చే ఏడాదిలో రిలీజయ్యే దసరా వరకూ ఒక్కో చిత్రం పేరు వైవిధ్యంగా అనిపిస్తాయి.

తన సినిమా టైటిల్ జనాల నోట్లో ఈజీగా నానేలా ఉంటే బాగుంటుందన్నది నాని ప్రాథమిక విజయసూత్రం. ఓరకంగా మౌత్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడంలో ఈ టైటిలే సగం విజయానికి తారక మంత్రమన్నది ఈ హీరో గట్టి నమ్మకం. అందుకే ఇప్పటిదాకా తాను కథనాయకుడిగా నటించిన చిత్రాల పేర్లన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.  నాని మూవీల జాబితాను ఓసారి పరిశీలిస్తే...

చిత్రం                    విడుదలైన సంవత్సరం
4

1. అష్టాచెమ్మా                          2008
2. రైడ్                                        2009
3. స్నేహితుడా                          2009
4. భీమిలి కబడ్డీ జట్టు               2010
5. అలా మొదలైంది                 2011
6. పిల్ల జమిందార్                     2011
7. ఈగ                                          2012
8. ఎటో వెళ్లిపోయింది మనసు   2012
9. డి ఫర్ దోపిడీ                           2013
10. పైసా                                        2014
11. జెండా పై కపిరాజు                 2015
12. ఎవడే సుబ్రహ్మణ్యం             2015
13. భలే భలే మగాడివోయ్          2015
14. కృష్ణగాడి వీర ప్రేమ గాథ      2016
15. జెంటిల్ మెన్                        2016
16. మజ్ను                                   2016
17. నేను లోకల్                           2017
18. నిన్ను కోరి                              2017
19. ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)   2017
20. కృష్ణార్జున యుద్ధం                         2018
21. దేవదాస్                                          2018
22. జెర్సీ                                                 2019
23. గ్యాంగ్ లీడర్                                    2019
24. వి                                                        2020
25. టక్ జగదీశ్                                         2021
26. శ్యామ్ సింగరాయ్                              2021
27. అంతే ..సుందరానికి                          2022
28. దసరా                                                 2023

నాటి చిత్రాల పేర్లను తలపించేలా

1980-90 దశకాల్లో వచ్చిన చిత్రాల పేర్లు ఆనాటి హీరోలకు  మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ జాబితాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముందుంటారు. తన చిత్రం వస్తోందంటే దానికేపేరు పెడతారనే చర్చ జోరుగా సాగేది. అప్పుల అప్పారావు, జూలకటక, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, దొంగకోళ్లు, పైలా పచ్చీసు, గడుగ్గాయి, భామాకలాపం, జోకర్...ఇలా వచ్చే ప్రతి సినిమాపేరు సినీవర్గాలతోపాటు ప్రేక్షక లోకం మదిలో చెరిగిపోని ముద్రను వేసుకుంది. అదే తరహాలో ఈ తరంలో వచ్చే  నాని చిత్రాల టైటిళ్లూ  ఉండడం విశేషం.
Tags:    

Similar News