• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగస్టులో స్నేహితుల...

ఆగస్టులో స్నేహితుల బాక్సాఫీస్‌ వార్‌

By - Tupaki Desk
Update: 2019-02-25 07:55 GMT
నాని మరియు శర్వానంద్‌ మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. ఇద్దరు కూడా ఒకరి సినిమాల వేడుకలకు ఒకరు హాజరు అవుతూ వచ్చారు. వీరిద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఉండటంతో వీరి సినిమాల విడుదల విషయంలో ఇంత కాలం ఎప్పుడు కూడా క్లాష్‌ రాకుండా చూసుకున్నారు. అయితే మొదటి సారి వీరిద్దరు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడబోతున్నట్లుగా అనిపిస్తోంది. వీరి పోటీకి వచ్చే ఆగస్టు నెల వేదిక అయ్యేలా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ప్రారంభం అయిన నాని, విక్రమ్‌ కుమార్‌ ల మూవీ ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అఫిషియల్‌ గా అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది. నిన్న నాని పుట్టిన రోజు సందర్బంగా సినిమాకు గ్యాంగ్‌ లీడర్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేయడంతో పాటు ఆగస్టు లో మూవీ ఉంటుందని ప్రకటించారు. ఆగస్టు 15న సాహో మూవీ విడుదల కానుంది. కనుక సాహో విడుదలైన రెండు వారాలకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఆగస్టు 29 లేదా 30న ఈ చిత్రం విడుదల ఉంటుందనిపిస్తుంది.

ఇక శర్వానంద్‌ తమిళ బ్లాక్‌ బస్టర్‌ మూవీ '96' రీమేక్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే. దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందబోతున్న ఈ రీమేక్‌ లో సమంత హీరోయిన్‌ గా నటించనుంది. ఈ రీమేక్‌ ను ఆగస్టులో విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నాడట. దిల్‌ రాజు అనుకుంటే ఖచ్చితంగా ఆ టైం కు విడుదల చేస్తాడు. ఈ సినిమా కూడా సాహో విడుదలైన తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు కూడా ఒకే రోజు లేదంటే ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఈ స్నేహితుల బాక్సాఫీస్‌ వార్‌ లో ఎవరు గెలిచేనో చేడాలి.
Tags:    
  • Nani 
  • Sharwanand 
  • Box Office 
  • Telugu News 

Similar News

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

Copyright @2026

Powered by Blink CMS