ఈ వీకెండ్లో ఒకటికి ఐదు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించింది ‘ఇజం’ సినిమానే. పూరి జగన్నాథ్-నందమూరి కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు మంచి హైపే వచ్చింది. దానికి తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధికంగా రూ.3 కోట్లకు పైగా ఫస్ట్ డే షేర్ వచ్చింది ఈ చిత్రానికి. టాక్ డివైడ్ గా ఉన్నా సరే.. కలెక్షన్లకు ఢోకా లేకపోయింది. రెండో రోజు కూడా వసూళ్లు బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఆదివారం కాబట్టి మూడో రోజుకు కూడా ఢోకా లేకపోవచ్చు.
ఐతే కలెక్షన్లు ‘ఇజం’కు బాగా వచ్చినా.. ఈ వారం సినిమాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది మాత్రం ‘నందిని నర్సింగ్ హోం’ చిత్రమే. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయమైన ఈ సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది. గొప్ప సినిమా ఏమీ కాదు కానీ.. పైసావసూల్ ఎంటర్టైనర్ కావడంతో అందరూ ఈ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. నవీన్ నటనకు మంచి స్పందన రావడమే కాక.. వెన్నెల కిషోర్.. షకలక శంకర్.. సప్తగిరి కామెడీ హిలేరియస్ అంటున్నారు. కాకపోతే సినిమాను చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం.. పబ్లిసిటీ పెద్దగా లేకపోవడం మైనస్ అయింది.
ఇక ఈ వారం వచ్చిన మిగతా సినిమాల్లో ‘శంకర’ కాన్సెప్ట్ మంచిదే అయినా.. నారా రోహిత్ పెర్ఫామెన్స్ కూడా బాగున్నా.. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ ఉంది. ఇక రష్మి గౌతమ్ ‘తను వచ్చెనంట’ ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తోందట. ‘ఎల్-7’ గురించి మాట్లాడే వాళ్లే లేరు. కలెక్షన్ల పరంగా ‘ఇజం’.. టాక్ పరంగా ‘నందిని నర్సింగ్ హోం’ ఈ వారం సినిమాల్లో టాప్ లో నిలుస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/