నాగ్ ముఖంలో షైనింగ్ మిస్సయ్యిందే!!

Update: 2016-12-04 11:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ అంతా ఒక్కటే డిస్కషన్. అసలు కింగ్ నాగార్జున ఎందుకలా కనిపించాడు అనే. మొన్నటికి మొన్న తాహెర్ సౌండ్ వారింటి జరిగిన ఒక పెళ్ళికి టోటల్ టాలీవుడ్ అంతా అటెండ్ అయ్యింది. అయితే అక్కడ నాగ్ మాత్రం కాస్త విచిత్రమైన లుక్ లో కనిపించాడు. అదే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీస్తోంది.

ముఖం అంతా పాలిపోయి.. కంటిక్రింద నల్లటి మచ్చలతో.. జుట్టును వెనక్కి దువ్వేసి.. ఏంటో చాలా దిగాలుగా ఉన్నట్లు అయిపోయాడు నాగ్. 50 దాటినా కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపించే నటుల్లో నాగ్ ఒకడు. అలాంటి నాగ్ ఇప్పుడు ఇలా పాలిపోయిన పేలవమైన లుక్కులో కనిపిస్తుంటే అభిమానులు గుండె సన్నగిల్లిపోతోంది. అయితే మనోడు వయస్సు మీద పడటంతో న్యాచురల్ గానే ఇలా కనిపిస్తున్నాడా? లేకపోతే తన తదుపరి చిత్రం అయిన రాజు గారి గది కోసం ఏమైనా స్పెషల్ లుక్ ను తయారుచేసుకునే పనిలో పడ్డాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే నాగ్ ముఖంలో ఎంతటి షైనింగ్ మిస్సయినా కూడా.. మన సీనియర్ హీరోలు అండ్ జూనియర్ హీరోల్లో ఆయనే చాలా హ్యాండ్సమ్ అనే చెప్పాలి. ఆ వయస్సులో ఆ ఫిజిక్ కాని.. ఆ లుక్స్ కాని.. డ్యాషింగ్ అంతే!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News