మన్మథుడు.. మళ్లీ మొదలుపెడుతున్నాడా
కొన్ని చిత్రాలు ఎప్పటికీ మరిచిపోలేనంతగా మనసుల్లో ఉండిపోతాయంతే. అలాంటిదే నాగార్జున నటించిన మన్మథుడు కూడా. 2002లో వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో సూపర్ డూపర్ హిట్. హీరోగా నాగార్జున.. రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్టర్ విజయ్ భాస్కర్ లు కలిసి మ్యాజిక్ చేసేశారు.
ఇప్పుడా మన్మథుడికి సీక్వెల్ తీయాలనే ఆలోచన చేస్తున్నారట. రీసెంట్ గా ఓ ఫంక్షన్ లో కలిసిన నాగార్జున- త్రివిక్రమ్ లు దీని గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. స్వయంగా నాగ్ ఈ ప్రతిపాదన చేయగా.. త్రివిక్రమ్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడట. త్వరలో తాను ఓ స్టోరీ లైన్ తో వస్తానని కూడా మాటిచ్చాడట మాటల మాంత్రికుడు. ఇప్పటికైతే ఇంకా సాధ్యాసాధ్యాల పరిశీలన దగ్గరే ఉంది కానీ.. త్రివిక్రమ్ తలచుకుంటే ఇదేమీ అసాధ్యమైన ప్రాజెక్ట్ కాదన్నది ఇండస్ట్రీ టాక్.
మన్మథుడు అంటే ఆద్యంతం నవ్వులు పంచేసిన సినిమా. త్రివిక్రమ్ పెన్ను పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించారు. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ అంటే.. ఆ స్థాయిలో పంచ్ లు ఎదురు చూస్తారు ఆడియన్స్. అందుకే అన్ని యాంగిల్స్ లోను పరిశీలించుకుని అప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్సులున్నాయి. ఒకవేళ ఫైనలైజ్ అయితే మాత్రం.. మన్మథుడు2కి త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తాడు.