వీడియో: అక్కినేనివారి అల్లరి మామూలుగా లేదుగా

Update: 2019-07-20 10:17 GMT
అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'మన్మథుడు 2'  ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.  ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఫిలిం మేకర్స్ ఒక వీడియో ను రిలీజ్ చేశారు.  దాదాపు ఎడున్నర నిముషం ఉన్న ఈ వీడియోలో నాగార్జున ఈ చిత్ర దర్శకుడు రాహుల్ ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ ప్రాంక్ వీడియోకి ఒక సీనియర్ జూనియర్ ను ర్యాగింగ్ చేసిన తరహాలో ఉంది.

వీడియో ప్రారంభంలో నాగ్ రాహుల్ కు ఫోన్ చేస్తారు.  ఆ సమయంలో రాహుల్ కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి డబ్బింగ్ స్టూడియోలో  'మన్మథుడు 2' డబ్బింగ్ వర్క్స్ లో బిజీగా ఉంటాడు. అయితే రాహుల్ ను సరదాగా ఏడిపించాలని డిసైడ్ అయిన నాగార్జున.. తనకో పోర్చుగల్ ఫుడ్ ఐటెం తినాలని ఉందని అంటాడు.  పోర్చుగల్ లో చాలా రోజులు షూట్ చేశాము కదా అక్కడ ఒక డిష్ ను రెగ్యులర్ గా తిన్నాం.  అది నాకు ఇప్పుడు తినాలని అనిపిస్తుంది.. తెచ్చివ్వు అంటూ ఒక హోటల్ కు వెళ్ళమని చెప్తాడు.  నాగ్ చెప్పినట్టుగా రాహుల్ ఆ హోటల్ కు వెళ్ళిన తర్వాత బ్లూటూత్ లో సూచనలు ఇస్తూ ఇలా చెయ్.. అలా చెయ్ అంటూ పిచ్చిపిచ్చి పనులు చేయించి రాహుల్ ను ఆటపట్టిస్తాడు.  ఒక కస్టమర్ తాగుతున్న డ్రింక్ ను లాక్కోమని.. ఒక లేడీ దగ్గరకు వెళ్లి  "ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్" అంటూ తనకు చెప్పమని.. రాహుల్ కు టెస్ట్ పెడతాడు.

అయితే నాగ్ చెప్పిన పనులన్నీ తూచ తప్పకుండా చేసి ఆ మిషన్ ను పూర్తి చేస్తాడు రాహుల్.  నాగ్ చిలిపిగా డైరెక్షన్స్ ఇవ్వడం.. రాహుల్ కాస్త మొహమాటపడుతూనే వాటిని పూర్తీ చేయడం.. వీడియో అంతా సరదాగా సాగింది.  ఆలస్యం ఎందుకు అక్కనేని వారి అల్లరిని ఒకసారి చూసేయండి.

Full View
Tags:    

Similar News