లయన్‌ కి చిట్టి ఎలుకలు సపోర్ట్ చేయకపోయినా ఏమీ ఫరక్ పడదు: నాగబాబు

Update: 2021-04-13 17:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాకు ఏపీలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. టికెట్ ధరలను పెంచకుండా జీఓ జారీ చేయడంపై వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ బెంచ్ మూడ్రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఈ వ్యవహారంతో నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై ఇండస్ట్రీ పెద్దలు కల్పించుకోవడం లేదంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేసే వ్యక్తి కాదని.. ఆయన రాష్ట్ర పరిపాలనలో బిజీగా ఉన్నారని.. కొంతమంది లీడర్స్ కావాలనే 'వకీల్ సాబ్' సినిమాని అడ్డుకుంటున్నారంటూ నాగబాబు అన్నారు. ఇదే విషయంపై ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌ లో మరోసారి స్పందించారు. 'టాలీవుడ్ లో వకీల్ సాబ్ చిత్రానికి జరుగుతున్న దానిపై ఎందుకు ఎవరూ స్పందించడం లేదు' అని ఓ నెటిజన్ నాగబాబును స్పందించారు. ''లయన్‌ కి చిట్టి ఎలుకలు సపోర్ట్ చేసినా చేయకపోయినా లయన్‌ కి ఏమీ ఫరక్ పడదు. అయినా సూపర్ హిట్ మూవీకి ఎవరి సపోర్ట్ అక్కర్లేదు'' అంటూ సమాధానం ఇచ్చారు నాగబాబు.
Tags:    

Similar News