ఇస్మార్ట్‌ పోరి ఈ తప్పులను సరిదిద్దుకోవాలి

Update: 2020-04-28 05:00 GMT
తెలుగు ప్రేక్షకులకు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకున్న ముద్దుగుమ్మ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో నభా నటేష్‌ నటన సినిమా సక్సెస్‌ లో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఈమె తన వద్దకు వచ్చిన నిర్మాతలను దర్శకులను పారితోషికంతో భయపెడుతుందట. పాత్ర ఎలా ఉన్నా పర్వాలేదు.. కథ ఏదైనా పర్వాలేదు తనకు ఎక్కువ పారితోషికం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుందట. అలా కొన్ని సినిమాలు ఈమె చేయి జారి పోయాయి. పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేస్తే ఖచ్చితం గా మంచి పాత్రలు చేజారుతాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం తర్వాత ఈమె చేసిన డిస్కోరాజా నిరాశ పర్చింది. పైగా ఈ అమ్మడు కాస్త అతి చేస్తూ ఉంటుంది. దాంతో యంగ్‌ హీరోలను ఇన్‌ సెక్యూర్‌ గా ఫీల్‌ అయ్యి ఆమెను పక్కన పెట్టేస్తున్నారు.

ప్రస్తుతం సోలో బ్రతుకే సోబెటర్‌ చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాతో పాటు మరోటి కూడా రెడీగా ఉంది. ఈమెకున్న క్రేజ్‌ మరియు ట్యాలెంట్‌ కు కాస్త అతి తగ్గించుకుని పారితోషికం విషయంలో బెట్టు చేయకుండా సినిమాలకు కమిట్‌ అయితే మంచి హీరోయిన్‌ గా పేరు దక్కించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ జాబితా లో చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదు ఇదే పద్దతిని కొనసాగిస్తానంటే మాత్రం ఈమె కెరీర్‌ లో చాలా త్వరగా ఫేడ్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News