ఎన్టీఆర్ తో మురగదాస్ ఒకే కానీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని కొద్ది రోజులుగా కథనాలు వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తారక్ ని అదిరిపోయే స్క్రిప్టుతో లాక్ చేసినట్లు బలమైన కథనాలు వెలువడ్డాయి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ముగదాస్ తోనే యంగ్ టైగర్ సినిమా చేయనున్నారని... తారక్ కాల్షీట్లు కూడా కేటాయించారని ప్రచారమైంది. మురగదాస్ తో ఛాన్స్ అంటే ఏ హీరో కాదనరు. తారక్ ఆ అరుదైన అవకాశం ఎందుకు మిస్ చేసుకుంటాడు? అన్న యాంగిల్ లో ప్రచారం సాగింది. పైగా తారక్ ఇప్పుడు కథల విషయంలో మూస మార్గంలో వెళ్లడం లేదు. కాస్త ఇన్నోవేటివ్ గా ముందుకు వెళ్తున్నాడు. రొటినిటీని దూరం పెట్టి కాన్సెప్ట్ లు నమ్మి సినిమాలు చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో మురగదాస్ తో పని చేస్తే తారక్ మరింత షైన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారమైంది. ఈ కాంబోపై రకరకాల కథనాలు టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మారాయి. ఇది నిజమా? అని ప్రశ్నిస్తే.. తాజాగా ఈ కథనాలపై మురగదాస్ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ కి కథ వినిపంచా. కానీ అది జరిగి చాలా కాలమవుతోంది. మళ్లీ ఇటీవలి కాలంలో తారక్ ని కలవలేదు. ఎలాంటి కథ వినిపించనూ లేదు. తదుపరి ఆయనతో సినిమా చేస్తున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఎక్కడా ప్రకటించలేదు. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను అని తెలిపారు.
ఇంత వరకూ బాగానే ఉంది. మరి అప్పుడెప్పుడో మురగదాస్ వినిపించిన స్రిప్ట్ కి తారక్ ఎస్ చెప్పాడా? నో చెప్పాడా? అన్నది మాత్రం మురగదాస్ రివీల్ చేయలేదు. త్వరలోనే తెలుగు లో మరో సినిమా చేస్తానని ప్రకటించారు. మరి ఆ సినిమా తారక్ తో చేస్తాడా? ఇంతకీ హీరో మైండ్ లో మురుగదాస్ ఉన్నారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదేగాక `త్రీ ఇడియట్స్` విషయంలో శంకర్-మహేష్ మధ్య అభిప్రాయ భేధంలా ఇంకేదైనా ఉందా? అన్నది సస్పెన్స్ గా మారింది.