ఏపీ సినిమా తెలంగాణ సినిమా అంటూ డివైడ్ చేస్తున్న ఎంపీ!
ఇన్నాళ్లు ఏపీ సినిమా అయినా తెలంగాణ సినిమా అయినా ఒక్కటే. హైదరాబాద్ లోనే టాలీవుడ్ ఉంది. తెలుగు చిత్రసీమ అనేది ఒక్కటే. దీనిని మార్చేందుకు ఇప్పటికే పలువురు ప్రయత్నిస్తున్న వైనం కనిపిస్తోంది. వైజాగ్ లో టాలీవుడ్ ని నిర్మించేందుకు ఏపీ సీఎం జగన్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ప్రభృతులు ప్రయత్నిస్తున్నారని స్టూడియోలు కట్టి తొలి అడుగు వేస్తారని ప్రచారమవుతోంది.
అయితే ఈ ప్రయత్నాలన్నిటికీ భిన్నంగా ఓ మాజీ ఎంపీ కోడలు ఏపీ టాలీవుడ్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారట. దానికోసం తొలిగా ఎంచుకున్న మార్గం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏమిటా మార్గం? అంటే ఇకపై హైదరాబాద్ లొకేషన్లు కానీ హైదరాబాద్ స్టూడియోల్ని కానీ.. హైదరాబాద్ టెక్నీషియన్లు ఆర్టిస్టులను కానీ ఎంపిక చేసుకోరట.
దానికి బదులుగా కేవలం ఏపీలో పుట్టిన ఆర్టిస్టులు టెక్నీషియన్లతో మాత్రమే సినిమాలు తీస్తారట. తొలి మూవీ ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. తొందర్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీకి ఏపీకి చెందిన ప్రముఖ మాజీ ఎంపీ క్లాప్ కొట్టి ప్రారంభించడం ఆసక్తికరం. ఆయన కోడలే స్వయంగా ఈ మూవీని నిర్మిస్తుండడం ఇంకో విశేషం. అంతా రాజమండ్రి పరిసరాల్లోని ప్రతిభావంతుల్ని ఎంపిక చేశారని హింట్ ఒకటి లీకైంది. నిజానికి ఈ మూవీ కోసం తొలుత హైదరాబాద్ స్టూడియోలు.. టెక్నీషియన్లను అనుకుని అడ్వాన్సులిచ్చేశారట. కానీ ఇంతలోనే ఏమైందో కానీ ఏపీకి చెందిన వారు మాత్రమేనని రీప్లేస్ చేసేశారు.
మొత్తానికి ఏపీ తెలంగాణ డివైడ్ తర్వాత మొట్ట మొదటి ఏపీ సినిమా ని సిద్ధం చేస్తున్నారట. ఇక తమ మోటో కూడా ఏపీ సినిమానే అని కూడా ప్రకటించనున్నారట అధికారికంగా. హైదరాబాద్ లో సినిమా తీసి ఏపీలో మార్కెట్ చేసుకుంటున్నట్టే.. అక్కడ తీసి ఇక్కడ మార్కెట్ చేయాలన్నది ప్లాన్ అట. ఇకపై దీనికి ఉధృతంగా ప్రచారం చేసి ఏపీ టాలీవుడ్ అనే అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చే ప్లాన్ ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరో ఒకరైనా ఉద్యమం తెస్తేనే కదా! ఏపీ టాలీవుడ్ అయినా వైజాగ్ టాలీవుడ్ అయినా సాధ్యమయ్యేది! అంటూ గుసగుసలు వేడెక్కిపోతున్నాయ్.