మార్చి నెల సినిమాల మీద ఓ లుక్కేద్దామా..!

Update: 2021-03-01 10:51 GMT
సినిమా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు రావడంతో టాలీవుడ్ లో ఎప్పటిలాగే సినిమాల సందడి మొదలైంది. గడిచిన రెండు నెలల్లో అనేక సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఈ క్రమంలో మార్చి నెలలో కూడా చాలా మూవీస్ థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. ముందుగా మార్చి 5న సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' విడుదల కానుంది. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెలుగులో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఏ1 పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా కాంబోలో వస్తున్న 'పవర్ ప్లే' కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఆర్కే నాయుడిగా గుర్తింపు పొందిన సాగర్ హీరోగా తెరకెక్కిన 'షాదీ ముబారక్' చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు మార్చి 5న విడుదల చేస్తున్నాడు. వీటితోపాటు ఈ ఫ్రైడే రాజేంద్రప్రసాద్ 'క్లైమాక్స్' - 'ఏ' (ఎడి ఇన్ఫీనిటం) - 'ఏప్రిల్ 28 ఏం జరిగింది' అనే సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఈ క్రమంలో మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా నాలుగు సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. టాలెంటెడ్ యువ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న తాజా చిత్రం ''శ్రీకారం'' అంద‌రి ఫేవ‌రేట్ గా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌ పై రామ్ ఆచంట‌ - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఆల్రేడీ శర్వానంద్ కి ఉన్న ఇమేజ్ తో ఈ సినిమాకు ఓపెనింగ్స్ తీసుకువ‌చ్చే అవకాశం ఉంది. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న 'గాలి సంపత్' సినిమా శివరాత్రికే రానుంది. వ్వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు - న‌ట‌కిరీటి రాజేంద్ర ‌ప్ర‌సాద్ ప్రధాన పాత్రలతో అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమా మీద మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి.

అలానే స్వప్న సినిమాస్ మరియు వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న 'జాతిరత్నాలు' చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అర్బ‌న్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాలో కామెడీకి ఆడియెన్స్ క‌నెక్ట్ అయితే ఇది పెద్ద హిట్ కొట్టే అవ‌కాశాలున్నాయి. ఇక క‌న్న‌డలో భారీ బడ్జెట్ సినిమాగా ప్ర‌చారం అవుతున్న 'రాబ‌ర్ట్' సినిమా తెలుగులో విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల ఎటెన్ష‌న్ పెద్ద‌గా సంపాదించ‌లేదనే చెప్పాలి.

మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'మోసగాళ్ళు' సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక అదే రోజు ఆది సాయి కుమార్ నటించిన 'శశి' సినిమా విడుదల కానుంది. అలానే అల్లు అరవింద్ సమర్పణలో యువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' మార్చి 19న రిలీజ్ కానుంది. ఇదే క్రమంలో యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన 'రంగ్ దే' సినిమాని మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇక చాన్నాళ్ల నుంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న దగ్గుబాటి రానా 'అరణ్య' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో అదే శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇక కీరవాణి తనయుడు శ్రీ సింహా నటించిన 'తెల్లవారితే గురువారం' చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చి నెలలో ఏయే సినిమాలు విజయాన్ని అందుకుంటాయో చూడాలి.


Tags:    

Similar News