తెలంగాణలో సినిమా థియేటర్ల ఓపెన్ కు మరింత ఆలస్యం?
అన్ లాక్ 5 మార్గదర్శకాల కోసం సినిమా థియేటర్లను ఈ నెల 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం ఇప్పటికే అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. సింగిల్ థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు 50 శాతం సామర్థ్యంతో ఓపెన్ చేసుకునే వెసులు బాటు ఇచ్చినప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు ఒక కొలిక్కి వస్తూ.. తగ్గు ముఖం పడుతున్న వేళ.. థియేటర్లు.. స్కూళ్లు.. కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేసి రిస్కు చేయాల్సిన అవసరం ఉందా? అన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీనికి తగ్గట్లే..తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారర్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అన్ లాక్ 5కు సంబంధించి మార్గదర్శకాల్ని జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అందులో థియేటర్లు.. స్కూళ్లు.. ఎంటర్ టైన్ మెంట్ పార్కులు.. కోచింగ్ సెంటర్ల ప్రస్తావన లేకపోవటం గమనార్హం.
అంతేకాదు.. థియేటర్లను ఎప్పుడు ఓపెన్ చేసే విషయాన్ని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న వేళ.. కేసుల నమోదు ఒక మోస్తరుగా నమోదువుతున్నాయి. ఇలాంటి వేళ.. స్కూళ్లు తెరుచుకోవచ్చు అన్న మాట చెప్పినా.. ప్రజలు అందుకు ఎంతమేర సిద్ధంగా ఉన్నారన్నది సందేహమే. థియేటర్ల విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉంది.
ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేసినా.. కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా లేని వేళ.. తెరిచినా ప్రయోజనం ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల నమోదు భారీగా ఉన్న వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. అందుకే.. తొందరపాటుతో కొత్త సమస్యల్ని తెచ్చుకోకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. స్కూళ్లు.. థియేటర్లు..ఎంటర్ టైన్ మెంట్ పార్కుల్ని ఓపెన్ చేసే విషయంలో పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఓపెన్ చేయాలని భావిస్తే.. దసరా నాటికి ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.