బయటకు వచ్చాక కూడా మోనాల్ కంటిన్యూ చేస్తోంది
బిగ్ బాస్ లో కొన్ని రిలేషన్ షిప్ లు స్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. ఆ విషయం గతంలో పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. హౌస్ లో ఉన్న సమయంలో చాలా క్లోజ్ గా ఉన్న వారు బయటకు వచ్చిన తర్వాత కనీసం కలుకునే సందర్బాలు కూడా ఉండవు. అవి అక్కడి వరకే అనేది చాలా మంది మాటలు. అయితే సీజన్ 4 లో చాలా ప్రత్యేకంగా నిలిచిన మోనాల్ మాత్రం తన రిలేషన్ ను బయట కూడా కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమె మొదట అఖిల్ మరియు అభిజిత్ తో సన్నిహితంగా ఉంది. ప్రేమ దేశంలో హీరోయిన్ మాదిరిగా ఇద్దరికి ప్రేమ పంచింది. ఆ తర్వాత అఖిల్ తోనే ఈమె సెటిల్ అయ్యింది.
మద్య మద్యలో గొడవలు వచ్చినా కూడా అఖిల్ మరియు మోనాల్ ల జోడీ చివరి వరకు కంటిన్యూ అయ్యింది. వీరిద్దరికి అత్యంత ఆప్తుడిగా సోహెల్ నిలిచాడు. సోహెల్ ను సోదరుడిగా చెప్పే మోనాల్ అఖిల్ తో మాత్రం చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇక వీరు బయటకు వచ్చిన తర్వాత కూడా చిల్ అవుతున్నారు. కొత్త సంవత్సరం సందర్బంగా ఈ ముగ్గురు కలిశారు. ఈ సందర్బంగా ఫొటో షూట్ లు సరదా వీడియోలతో సందడి చేశారు. వీరి ఫొటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈమె ఇంకా అఖిల్ తో క్లోజ్ గా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అఖిల్ కంటే మూడు నాలుగు సంవత్సరాలు పెద్దది అయిన మోనాల్ అతడితో అంత సన్నిహితంగా ఉండటంతో మళ్లీ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.