మొహెంజదారో.. ప్రస్తుతం మన దేశంలో మోస్ట్ అవైటెడ్ మూవీ. దీన్ని ఈ కేటగిరిలోకి ఎందుకు చేర్చాలో.. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రతీ ఫ్రేమ్ ని, ప్రతి విజువల్ ని దర్శకుడు తీర్చిదిద్దిన తీరు చూస్తే.. ఆశ్చర్యం వేయకమానదు. హాలీవుడ్ సినిమాలకు మనోళ్లు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది మొహెంజొదారో ట్రైలర్.
హాలీవుడ్ లో గ్లాడియేటర్ పేరుతో గతంలో ఓ మూవీ వచ్చింది. బహుశా.. కొన్ని రకాల సెట్స్ కు ఆ చిత్రాన్ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని ఉండొచ్చు కానీ.. మనం చూడని ఇండియాని చూపించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. క్రీస్తు పూర్వం 2016 అంటూ ఆరంభించిన విధానమే ఆకట్టుకుంటుంది. మొహెంజొదారోను కాపాడేందుకు అవకాశం ఉన్న ఆఖరి వ్యక్తిగా హృతిక్ రోషన్ కనిపిస్తాడు.
ఇక దర్శకుడు కొన్ని విషయాల్లో సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ తో పాటు మహిళల డ్రెసింగ్ విషయంలో కొంత స్వేచ్ఛ తీసుకున్నాడని అనుకోవచ్చు. అయితే.. ఆ కాలం నాటికి మొహెంజొదారో అంటే.. అత్యుత్తమ నాగరికతల్లో ఒకటి కాబట్టి.. ఆ లిబర్టీని యాక్సెప్ట్ చేసేయచ్చు. మొత్తానికి తప్పకుండా చూడాలనే ఆసక్తిని కలిగించడంలో మొహెంజొదారో ట్రైలర్ సక్సెస్ అయింది.
Full View