దృశ్యం సీక్వెల్ ఆగిపోయిందన్నారు కానీ..!
మోహన్ లాల్ - మీనా తదితరులు నటించిన 2013 బ్లాక్ బస్టర్ మూవీ `దృశ్యం`కి సీక్వెల్ తెరకెక్కనుంది. కుటుంబ సమేతంగా మెచ్చిన ఈ థ్రిల్లర్ కి సీక్వెల్ వస్తోంది అంటే ఇతరుల కంటే విక్టరీ వెంకటేష్ అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే మలయాళ మూవీని తెలుగులో వెంకీ హీరోగా రీమేక్ చేస్తే ఇక్కడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి విధితమే.
దృశ్యంకి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే మోహన్ లాల్ ప్రకటించారు. అక్కడ తీస్తే ఇక్కడ తానే సీక్వెల్ లో నటిస్తానని వెంకీ ప్రమోషన్స్ లో అన్నారు. ఎట్టకేలకు సీక్వెల్ కి టైమొచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. సీక్వెల్లోనూ జార్జ్ కుట్టి పాత్రను తిరిగి పోషించనున్నారట. తోడుపుళ (కేరళ) లో `దృశ్యం 2` చిత్రీకరణ ఇప్పటికే జరుగుతోందిట.
మోహన్ లాల్ దృశ్యం 2 ని ప్రకటించగానే.. ఇంటర్నెట్ షేకైంది. ఆన్ సెట్స్ నుండి లాల్ స్వయంగా ఓ ఫోటోని పంచుకున్న కొద్ది నిమిషాల్లోనే # దృశ్యం 2 సోషల్ మీడియాలో ట్రెండింగ్ ప్రారంభమైంది. 2013 ఫ్యామిలీ థ్రిల్లర్‌కు సీక్వెల్ అయిన దృశ్యం కి దివంగత దర్శకుడు నిషికాంత్ కామత్(50) దర్శకత్వం వహించారు. సీక్వెల్ ని జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సహనటులు మీనా- అన్సిబా- ఎస్తేర్ అనిల్ నటిస్తున్నారు. వీరితో పాటు జీతు జోసెఫ్ తో ఒక చిత్రాన్ని పంచుకున్న మోహన్ లాల్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఇలా వ్రాశారు. ``జార్జ్ కుట్టి మరియు కుటుంబం. అతను # దృశ్యం 2 # దృష్టి`` అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించాడు.
సీక్వెల్ దర్శకుడు జీతు జోసెఫ్ దీనిపై స్పందించారు. ``6 సంవత్సరాల తరువాత సీక్వెల్ తీస్తున్నాం`` అని వెల్లడించారు. తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుతో తన అనుబంధాన్ని ట్వీట్ లో ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రం నిలిపివేశారు అంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ చిత్ర దర్శకుడు జీతు జోసెఫ్ ఫేస్‌బుక్ పోస్ట్ లో లాక్డౌన్ ముగిసిన తర్వాత చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని రాశారు. జీతు జోసెఫ్- మోహన్ లాల్ కాంబో కొత్తేమీ కాదు. ఇంతకుముందు `రామ్` అనే చిత్రానికి కలిసి పని చేశారు.
`దృశ్యం` నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్. తన కుమార్తె అనుకోకుండా ఒక యువకుడిని (విలన్ కుమారుడిని) చంపిన తరువాత పోలీసుల హిట్ జాబితాలో చేరిన జార్జ్ కుట్టి (మోహన్ లాల్ పోషించిన) కుమార్తెను కాపాడుకునేందుకు ఎలా పోరాడాడు? అన్నదే సినిమా కథాంశం. దృశ్యం అనేక ఇతర భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది. ఇందులో హిందీ వెర్షన్ లో అజయ్ దేవ్‌గన్ - టబు - శ్రియ శరణ్ నటించారు. తమిళ రీమేక్ పాపనాశం లో కమల్ హాసన్- గౌతమి నటించారు.