మెగా రీమేక్ మళ్ళీ చేతులు మారిందా..?

Update: 2020-12-15 07:12 GMT
మెగాస్టార్ చిరంజీవి మళయాళ 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ముందుగా ఈ రీమేక్ బాధ్యతలు యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్నాడని.. దీంతో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతిలోకి వెళ్ళిందని అన్నారు. అయితే వినాయక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో 'లూసిఫర్' మరొకరి చేతిలోకి వెళ్లిందన్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా కి తెలుగు 'లూసిఫర్' కి బాధ్యతలు అప్పగించారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ సుజీత్ దగ్గరికే వెళ్లిందట. ఇప్పటికే మెగాస్టార్ చెప్పిన మార్పులను దృష్టిలో పెట్టుకుని సుజీత్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. ఇక ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు మెగా రీమేక్ పై రూమర్స్ మాత్రం ఆగలే లేవు. కాగా, మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'లూసిఫర్' సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగులో హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు.
Tags:    

Similar News