• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ తమిళ దర్శకుడికి ఓకే...

చరణ్‌ తమిళ దర్శకుడికి ఓకే చెప్పినట్లేనా?

By - Tupaki Desk
Update: 2020-10-14 17:58 GMT
రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఆ సినిమా కోసం ఇద్దరు కూడా మరే సినిమాలు కూడా చేయకుండా పూర్తిగా జక్కన్న కోసం కేటాయించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు ఎన్టీఆర్‌ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. కాని రామ్‌ చరణ్‌ మాత్రం ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ఆచార్య సినిమాలో చరణ్‌ గెస్ట్‌ రోల్‌ లో నటించబోతున్నాడు. ఆ తర్వాత చరణ్‌ ఏ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పలువురు దర్శకులు మరియు రచయితలు ఇప్పటికే చరణ్‌ కు కథలు వినిపించారని.. ఆ దర్శకుడితో చరణ్‌ సినిమా.. ఈ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఎవరికి ఓకే చెప్పలేదు. తాజాగా చరణ్‌ తమిళ దర్శకుడు మోహన్‌ రాజా చెప్పిన ఒక కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ప్రముఖ దర్శకుడు అయిన ఎడిటర్‌ మోహన్‌ తనయుడు అయిన మోహన్‌ రాజా తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చకున్నారు.

ఈయన దర్శకత్వంలో వచ్చిన తమిళ 'తనిఒరువన్‌' సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. అదే తెలుగులో ధృవ గా రీమేక్‌ అయ్యింది. చరణ్‌ కు దృవ సూపర్‌ హిట్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. ధృవ సినిమాకే మోహన్‌ రాజాతో చరణ్‌ వర్క్‌ చేయాల్సి ఉన్నా వీలు పడలేదు. ఇప్పుడు ఒక పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ తో చరణ్‌ ను మోహన్‌ రాజా ఒప్పించడం జరిగిందట. వచ్చే ఏడాదిలో వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతున్నట్లుగా రాబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. మరో వైపు మోన్‌ రాజా తనిఒరువన్‌ 2 సినిమాను కూడా చేస్తున్నాడు. దాన్ని తెలుగులో ధృవ 2 గా రీమేక్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.
Tags:    
  • Ram Charan 
  • Mohan Raja 
  • Pan India Movie 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS