కరోనా నుంచి కోలుకున్న తమన్నాకు వెల్ కం
తమన్నా భాటియా కోవిడ్ నుంచి కోలుకుని ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విమానాశ్రయంలో ప్రత్యక్షమైంది. దాదాపు 14 రోజుల దిగ్బంధన వ్యవధిని పూర్తి చేసిన తరువాత మిల్కీ తిరిగి షూటింగులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నానని ప్రకటించింది.
అక్టోబర్ 5 న తన ఇన్ స్టాగ్రామ్ లో కోవిడ్ -19 కు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించిన తమన్నా.. ఆస్పత్రిలో మెరుగైన చికిత్సతో కోలుకుంది. స్వీయనిర్భంధ వ్యవధిని పూర్తి చేసి ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యానని.. తదుపరి చిత్రం షూటింగ్ కి అటెండవుతానని వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ముంబైలో తన నివాసానికి కార్ లో వెళ్లిన తమన్నాను అమ్మా నాన్నలు హగ్ ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన వీడియోని మిల్కీ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇంతకుముందు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన అనంతరం తమన్నా ఉద్వేగానికి గురైన సంగతి విధితమే. ``నా బృందం నేను సెట్ లో చాలా క్రమశిక్షణతో ఉన్నా.. దురదృష్టవశాత్తు నేను గత వారం తేలికపాటి జ్వరానికి గురయ్యాను. తప్పనిసరి పరీక్షలు చేసిన తరువాత COVID-19 పాజిటివ్ గా గుర్తించారు. వెంటనే హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరాను. వైద్య నిపుణుల సంరక్షణలో కోలుకుని ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాను. ఇది చాలా కష్టమైనా.. కానీ నేను చాలా బాగున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని బాధపెడుతోంది`` అని తమన్నా అంది.
కెరీర్ సంగతి చూస్తే.. గోపిచంద్ సరసన సీటీమార్ సహా `లవ్ మోక్ టైల్` రీమేక్ `గుర్తుందా శీతాకాలం`.., అంధాధున్ తెలుగు రీమేక్ తమన్నా క్యూలో ఉన్నాయి. `ది నవంబర్ స్టోరీ` తమిళ వెబ్ సినిమా చేస్తోంది.
Full View