మిల్కీ బ్యూటీ రెబ‌లిజం పీక్స్ కి చేరిందే

Update: 2020-11-04 00:30 GMT
మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. బాహుబ‌లిలో అవంతిక‌గా న‌టించాక ఈ అమ్మ‌డికి ఊహించ‌ని విధంగా టాలీవుడ్ లో బిగ్ గ్యాప్ వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే `ఊపిరి` చిత్రంతో విజ‌యం అందుకున్నా వెంట‌నే ఆఫ‌ర్లు అయితే త‌న ద‌రి చేర‌లేదు.

అయితే ఆ స‌మ‌యంలోనే మిల్కీ బ్యూటీ తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో స‌స్టెయిన్ అయ్యే ప్ర‌య‌త్నం చేసింది. సోష‌ల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో త‌న‌లోని రెబలిజాన్ని బ‌య‌ట‌కు తీసింది. ఒక‌దాని వెంట ఒక‌టిగా వరుస‌గా ఫోటోషూట్ల‌తో అంత‌ర్జాలాన్ని షేక్ చేయ‌డంలో పెద్ద స‌క్సెస్ అయ్యింది. సైరా-న‌ర‌సింహారెడ్డిలో న‌ర్త‌కిగా త‌న న‌ట‌న‌కు క్రిటిక్స్ స‌హా ఆడియెన్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఆ క్ర‌మంలోనే మిల్కీ ద‌శ కూడా తిరిగింద‌నే చెప్పాలి.

తాజాగా మిల్కీ మ‌రోసారి కుర్ర‌కారు గుండె ల‌య త‌ప్పే ఫోటో ట్రీట్ ని స్టార్ట్ చేసింది. ఈ భామ‌ ఇన్ స్టాలో షేర్ చేసిన తాజా ఫోటో బోయ్స్ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది. అస‌లే మిల్కీ వైట్ అందం.. ఆపై వైట్ టాప్ తో క్రీగంటి చూపుతో గుండె కోసేస్తోందిలా. ఓన్లీ టాప్ తోనే స‌రిపెట్టుకుని ఇలా క‌వ‌ర్ చేసేస్తోందా ... బాట‌మ్ ఆద‌మ‌రిచిందా? అంటూ బోయ్స్ కొంటెగా కామెంట్లు రువ్వుతున్నారు. ఏదేమైనా అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌డంలో వంద‌కు రెండొంద‌లు శాతం స‌క్సెసైంది త‌మ్మూ. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.

త‌మ‌న్నా కెరీర్ సంగ‌తి చూస్తే.. గోపిచంద్ స‌ర‌స‌న సీటీమార్ లో న‌టిస్తోంది. అలాగే `లవ్ మోక్ టైల్` రీమేక్ `గుర్తుందా శీతాకాలం`.., అంధాధున్ తెలుగు రీమేక్ ల‌లో త‌మ‌న్నా న‌టిస్తోంది. `ది నవంబర్ స్టోరీ` తమిళ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకొస్తోంది. త‌న కెరీర్ తొలి డిజిట‌ల్ సిరీస్ డిస్నీ ప్ల‌స్ లో రిలీజ్ కి రెడీ అవుతుంటే త‌మ‌న్నా తెగ ఎగ్జ‌యిట్ అయిపోతోంది.
Tags:    

Similar News