మరో ఫొటోతో వైరల్ అవుతున్న విలక్షణ నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు మిలింద్ సోమన్ ఇటీవల తన 55వ పుట్టిన రోజు సందర్బంగా తన ఫిజిక్ ను నిరూపించుకునేందుకు గాను గోవా బీచ్ లో నగ్నంగా పరుగులు తీశాడు. ఆయన నగ్నంగా బీచ్ లో పరుగులు తీసిన ఫొటోలు రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ఫిజిక్ విషయంపై ఫిట్ నెస్ విషయమై విమర్శకులు ప్రశంసలు కురిపించగా కొందరు మాత్రం పబ్లిక్ ప్రదేశాల్లో అలా న్యూడ్ గా పరిగెత్తడం ఏంటీ అంటూ విమర్శించారు. మొత్తానికి ఆ ఫొటో తెగ చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆయన మరో ఫొటోతో వార్తల్లో నిలిచాడు.
ఈసారి లేడీ గెటప్ లో ముక్కకు పుడక పెట్టి.. కళ్లకు కాటుక పెట్టి మొహంపై రంగు పూసుకున్న ఫొటోను మిలింద్ షేర్ చేశాడు. కాంచన సినిమాలో హీరో పాత్ర ఒక సీన్ లో ఇలా ఉంటుంది. మరి ఈయన ఎందుకు అలాంటి గెటప్ వేసుకున్నాడు అనేది చర్చనీయాంశం అయ్యింది. హోళీ కాదు మరేంటో కాదు కేవలం సరదాగా అంటూ ఈయన ఇన్ స్టాలో కామెంట్ పెట్టాడు. కాని ఈ గెటప్ వెనుక మరేదైనా ఉద్దేశ్యం ఉండి ఉంటుందా అంటూ అంతా చర్చిస్తున్నారు. మొత్తానికి నిన్నటి వరకు ఆ ఫొటోతో ఇప్పుడు ఈ ఫొటోతో మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.