వంటలనే నమ్ముకున్న దేవరకొండ బ్రదర్స్..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''మిడిల్ క్లాస్ మెలోడీస్''. వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా వంట నేపథ్యంలో సాగుతుందని అర్థం అవుతోంది. మిడిల్ క్లాస్ యువకుడు సిటీకి వెళ్లి సొంతంగా హోటల్ పెట్టే ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే పరిణామాలను ట్రైలర్ లో చూపించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే విజయ్ దేవరకొండ కెరీర్ ని టర్న్ చేసిన 'పెళ్లి చూపులు' సినిమా కూడా ఫుడ్ నేపథ్యంగానే సాగుతుంది.
కాగా, 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో సెకండ్ హీరోగా నటించిన విజయ్ దేవరకొండ.. రెండో సినిమా 'పెళ్లి చూపులు' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండకి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' రెండో సినిమా. మరి అన్నకి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఈ వంటల కాన్సెప్ట్ తమ్ముడికి కూడా హిట్ అందించి హీరోగా నిలబెడుతుందేమో చూడాలి. ఇక దీని గురించి డైరెక్టర్ వినోద్ దగ్గర ప్రస్తావించగా ఇది యాదృచ్చికంగా జరిగినట్లు చెప్పుకొచ్చారు. తుపాకీ టీమ్ తో డైరెక్టర్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ కు ఇంత భారీ స్థాయిలో ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఆడియెన్స్ నుంచి స్పందన వచ్చిందని తెలిపారు. సాఫ్ట్ వేర్ బ్యాగ్రౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వినోద్ అనంతోజు.. ఈ సినిమా స్టోరీని రెడీ చేసుకొని దాదాపు రెండేళ్లు తిరిగారని తెలుస్తోంది. మరి నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అవుతున్న ''మిడిల్ క్లాస్ మెలోడీస్'' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Full View