ఇతను మహేశ్ బిజినెస్ పార్టనరా??

Update: 2017-08-15 09:55 GMT
ఎవరితో స్నేహం ఎప్పుడు ఎలా బలపడుతుందో ఎప్పుడు ఎలా విడిపోతుందో ఎవరం చెప్పలేము అందులోనూ సినిమా ఫ్రెండ్ షిప్ లు ఇంకా తొందరగా మారుతూ ఉంటాయి. మన స్టార్ హీరోలు అయితే  ప్రొడ్యూసర్ల తోను సాటి హీరోలతోనూ మంచి స్నేహంగా ఉంటారు కానీ డైరెక్టర్లు తో ఫ్రెండ్ షిప్ అంటే అది కాస్తా తక్కువనే చెప్పాలి. పవన్ కల్యాణ్  - త్రివిక్రమ్ స్నేహం తప్పితే మరే హీరో డైరెక్టర్ బయట అంతా స్నేహంగా కనిపించారు. అయితే  ఇప్పుడు ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మంచి స్నేహం ఏర్పడిందిని తెలుస్తోంది.

షాడో  - శక్తి - బిల్లా లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన మెహెర్ రమేశ్ ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యామిలి ఫ్రెండ్ లో ఒకడుగా మారాడు అని చెబుతున్నారు మహేశ్ సన్నిహిత వర్గాలు. ఈ మధ్య కాలంలో మహేశ్కు సంబంధించి ఏ సినిమా ఈవెంట్ జరిగిన లేదా ఫ్యామిలి ఈవెంట్ జరిగిన రమేశ్ కనిపిస్తున్నాడు. మహేశ్ బాబు ఫ్లాప్ సినిమాలలో ఒకటైన ‘బాబీ’ లో రమేశ్ ఒక చిన్న పాత్రలో నటించాడు. ఆ తరువాత మహేశ్ చేసిన ఒక యాడ్ కు కూడా డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుండి వీళ్ళ మధ్య స్నేహం బలపడిందిని చెబుతున్నారు. మెహెర్ రమేశ్ కి విజయవాడతో మంచి సంబంధాలు ఉన్నాయిని చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొన్ని బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ సలహాలు కూడా మహేశ్ బాబుకి మెహెర్ రమేశ్ ఇస్తునట్లు చెబుతున్నారు. మహేశ్ బాబు భార్య నమ్రతా కూడా రమేశ్ అంటే బాగా నమ్మకమంటా.

ఈ మధ్య వంశీ పైడిపల్లి తో మొదలుకాబోతున్న సినిమా ఈవెంట్లో కూడా మెహెర్ రమేశ్ సందడి చేశాడు. చూస్తుంటే మహేశ్ బిజినెస్ పార్టనర్ ఏమో అనే అనుమానం వస్తుంది సినీ వర్గాలు వారికి.  మహేశ్ బాబు చేస్తున్న కార్పొరేట్ బ్రాండ్ వ్యవహారాలలో కూడా రమేశ్ హస్తం ఉందిని ఒక టాక్.
Tags:    

Similar News